భళా.. ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు

అమరావతి: ఏపిలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల నేప‌థ్యంలో టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడితో పాటు రాష్ట్ర‌ ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ తీరు పట్ల వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. టిడిపి విడుద‌ల చేసిన మేనిఫెస్టోను ఎస్ఈసీ ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌యసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

‘భళా! ఏమి డ్రామాలు నిమ్మగడ్డా, నారా బాబు! నేను కొట్టినట్లు నటిస్తానువ్వు ఏడ్చినట్లు నటించు అన్నట్లుంది మీ యవ్వారం. సమాధానం సంతృప్తిగా లేకపోతే చర్యలు తీసుకోవాలిగానీ టిడిపి మేనిఫెస్టోను నువ్వు రద్దు చేయడమేంటయ్యా నిమ్ము!’ అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు.