భర్త, అత్తమామల వేధింపులు: వివాహిత ఆత్మహత్య

suicide
suicide

భర్త, అత్తమామల వేధింపులు: వివాహిత ఆత్మహత్య

హైదరాబాద్‌: బేగంపేట ప్రాంతంలో వివాహిత గాంధీ లక్ష్మి (30) ఆత్మహత్యకు పాల్పడింది.. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునని చుట్టుపక్కలపరిసరాలను పరిశీలించారు.. తన చావుకు భర్త, అత్తమామల వేధింపులే కారణమంటూ రాసిన లేఖ లభ్యమైంది.. తన భర్త శశిధర్‌ తనను వీడియో తీసి స్నేహితులకు చూపుతానంటూ వేధింపులకు గురిచేసేవాడని , ఈ విషయం పోలీసులకు ఫిర్యాదుచేసినప్పటికీ పోలీసులు కూడ తన భర్తకే వంతపాడేవారని మృతురాలు లేఖలో పేర్కొంది.. మృతురాలి తల్లిదండ్రులు, తమ కుమార్తె ఆత్మహత్యపై అనుమానం వ్యక్త చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.