భర్తకు బాసటగా

COUPLE-1

COUPLE-

భర్తకు బాసటగా

ప్రైవేటురంగ ఉద్యోగాలు పెరిగి పోతున్న నేటి కాలంలో ప్రతి స్త్రీ ఎపుడో ఒకప్పుడు ఎదుర్కొనే సమస్యే ఇది. ఏదో ఒక సమయంలో భర్త నిరుద్యోగ సమస్యని భరించడం. ఇది నిజంగా సమస్యేనా అంటే ఇలాంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవ డానికి మహిళలు తీసుకునే ముందు జాగ్రత్త చర్యలు మొదలయిన వాటి మీద ఆ సమస్య తీవ్రత ఆధారపడి ఉంటుంది.

కారణాలేవయినా మీ భర్త ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేసి ఖాళీగా ఉన్నట్లయితే డబ్బులకు ఇబ్బందులు మామూలే. మీరు ఉద్యోగస్థులయితే కొంత నయమే అయినా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితుల్లో అప్పులు ఎక్కువ కాకుండా చూసుకోవచ్చు.

మొదట వృధా ఖర్చును ఆపండి. ్య సినిమాలు, షికార్లులాంటి సరదాలకు కొద్ది రోజులు సెలవివ్వండి. ్య కేబుల్‌ కనెక్షన్‌, పాల బిల్లు ఇంట్లోకి అవసరమయిన వస్తువుల్లో కూడా పొదుపుచేయ డానికి, అనవసరమయిన ఖర్చును నిరోధించడానికి ప్రయత్నించండి.

ఒకవేళ అప్పటికీ పరిస్థితి తీవ్రంగా ఉంటే, అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించడానికి దాచిన సొమ్ము నుండి డబ్బులు వాడుకోండి.

కొంతమందికి వస్తువులు పాడయితే బాగు చేయించడానికి బదులు, కొత్తవాటిని కొనే అలవాటు ఉంటుంది. అలా కాకుండా బాగు చేయిస్తే ఖర్చు కలిసొస్తుంది.

అత్యవసర పరిస్థితి వస్తే తక్కువ వడ్డీకి అప్పు తీసుకోవడానికి వెనకాడకండి.
అన్నింటికన్నా ముఖ్యమయినది ఇంట్లో పరిస్థితి మీ వారి దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడం. అలాగని వారిని ఇబ్బంది పెట్టకుండా సానుకూలంగా ప్రవర్తించండి.

మరో ఉద్యోగం వెతుక్కునే వరకు వారికి కావలసిన నైతికధైర్యాన్ని మీమాటలు,చేతల ద్వారా అందించండి.

ఎలాంటి ఇబ్బందులు లేకుంటే ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చోవడానికి ఎవరూ ఇష్టపడరు. కాబట్టి ఉద్యోగం మానేయడం వల్లనే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పదేపదే అనకండి.