భరోసా కేంద్రాన్ని సందర్శించిన హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌

radhakrishnan, high court judge
radhakrishnan, high court judge

హైదరాబాద్‌: రాష్ట్ర హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రాధా కృష్ణణ్‌ నగరంలోని భరోసా కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆయనతో పా టు మరికొందరు హైకోర్టు జడ్జిలు కూడా భరోసా కేంద్రానికి వచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రాధా కృష్ణణ్‌కు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. పోలీసు కమిషనర్‌తో పాటు డిజిపి మహేందర్‌ రెడ్డి, నగర అదనపు పోలీసు కమిషనర్‌ (క్రైం అండ్‌ సిట్‌) షిఖా గోయల్‌తో పా టు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మహేందర్‌ రెడ్డి భరోసా కేంద్రం పనితీరును చీఫ్‌ జస్టిస్‌ రాధా కృష్ణణ్‌కు వివరించారు. మహి ళలకు భరోసా కేంద్రం అందిస్తున్న చేయూతను కూడా ఆయన వివరించారు. భరోసా కేంద్రం వల్ల చాలా మంది మహిళలకు మేలు జరుగుతోందని ఆయన తె లిపారు.