భయమేలా ఓ మనసా!

Shirdi Saibaba
Shirdi Saibaba

భయమేలా ఓ మనసా!

భారతీయులకు కాశీకి అవినాభావన సంబంధం ఉన్నది. సాయిబాబా కూడా అప్పుడప్పుడు ‘నేను ఇప్పుడే కాశీలో (గంగానది)లో స్నానం చేసి వచ్చాను అనేవాడు. వివేకానందస్వామి కూడా భారతదేశ పర్యటనను చేయదలచుకున్నాడు. ఆయన తన పరివ్రాజక జీవితాన్ని కాశీక్షేత్రం నుండే ప్రారంభించారు. కాశీలోని అందమైన దేవాలయాలలో ఒకటి దుర్గాదేవి ఆలయం. వివేకానందులు అక్కడ దాదాపు వారం రోజులపాటు బసచేశాడంటారు. ఒకరోజు ఆయన దుర్గాదేవి దర్శనం చేసుకుని ఒకే ఒక అడుగు వెడల్పు ఉన్న కాలిబాటపై తిరిగి వెళ్లిపోతున్నారు ఆ ఆలయం నుండి. ఒకవైపు పెద్దకొలను ఉన్నది.

మరొకవైపు ఎత్తయిన ప్రహారీ కూడా ఉంది. చూడడానికి, నడవటానికి ఆ ప్రదేశం ఎంతో ఆహ్లాదంగా ఉన్నది. ఉన్నట్టుండి ఒక కోతులగుంపు ఎక్కడ నుండి ఊడిపడ్డాయో తెలియదు. ఆయనకు ఎదురైంది ఆ గుంపు. ఆయనవైపు ఆ గుంపు దూసుకురాబోతోంది. ఇక ఆయన వెంటనే వెనకకు తిరిగి నడక ప్రారంభంచారు. ఇక కోతులు కూడా ఆయన వెంట నడవ ప్రారంభించింది. అవి మీద పడి ఏ క్షణానయినా కరవవచ్చును. ఆయనకు ఏం చేయాలో తోచలేదు. నిస్సహాయస్థితిలో ఉండిపోయారాయన. ‘ఆగు, ఎదుర్కో, జంతులను ప్రతిఘటించు అని ఒక వృద్ధ సన్యాసి కంఠస్వరం వినిపించింది. అదే ఆదేశమనుకున్నాడు వివేకానందుడు. నూతన ఉత్సాహం కలిగింది. ధైర్యంగా నిలబడ్డాడు. కోతులవైపు తీక్షణంగా, తదేకంగా చూచాడు. కోతులన్నీ పరారయ్యాయి.

ఇది జంతుపరమైన సంఘటనే. జీవితంలో అనేక సంఘటనలు ఎదురవ్ఞతాయి. ధైర్యంగా ప్రతిఘటించి నిలబడాలి ప్రతిసంఘటను, బెంబేలెత్తిపోకూడదు. ప్రతిఘటించి నిలబడటం భౌతిక చర్యయే. అలా ప్రతిఘటించకుండా కూడా ఉండవచ్చును. ఆధ్యాత్మికపధంలో. అయితే దీనికి విశేషసాధన కావాలి. ఇటువంటి సంఘటనే వివేకానందుల వారి జీవితంలో జరిగింది కూడా. ఒకసారి ఆయన ఖేత్రి మహారాజుతో కలసి అడవ్ఞలలోనికిపోయారు. అందరి చేతులలోను తుపాకులున్నాయి.

వివేకానందుల వద్ద మాత్రం చేతికర్ర ఉన్నది. దారిలో ఒకచోట అందరూ కూర్చున్నారు. వారందరూ వివేకానందులకు కాస్తదూరంలో ఉన్నారు. హఠాత్తుగా ఒక పులి వివేకానుందులు కూర్చున్న చెట్టుపక్క నుండి దూసుకువెళ్లిపోయింది. అందరూ కాసేపటికి తేరుకున్నారు. ఖేత్రీ మహారాజు ఒక తుపాకీని వివేకానందులకు ఇచ్చి, ఉంచుకోమన్నారు. వివేకానందులు ‘ఒక సన్యాసి రక్షణార్ధం తుపాకీ అవసరం లేదు. ఏ పులీ ఏమీ చేయదు. నా వలన ఏ ప్రాణీ భీతిల్లకూడదు అన్నాడు.

ప్రతి జీవిలోను తన ఆత్మను దర్శించే ఆధ్యాత్మికుని ఏ జంతువ్ఞ చంపుతుంది? అంతటి ఆధ్యాత్మిక స్థితిని ఏ వ్యక్తి అయినా చేరుకోవచ్చు. అయితే చాలా కష్టపడాలి. కష్టేఫలి అన్నది మాట ఎల్ల ప్పుడూ సత్యమే. – యం.పి.సాయినాధ్‌