భద్రగిరి షూటింగ్‌ మొదలు కానుంది!

BHADRA GIRI
BHADRA GIRI

భద్రగిరి షూటింగ్‌ మొదలు కానుంది!

జె యన్‌ ఆర్‌ మూవీస్‌ పతాకంపై శుభకరి సమర్పణలో మోహన్‌ కష్ణ, జాహిదా సామ్‌ జంటగా జె యన్‌ ఆర్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం భద్రగిరి. ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం ఫిలింనగర్‌ లోని సాయిబాబా టెంపుల్‌ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రసన్న కుమార్‌ తొలి సన్నివేశానికి క్లాప్‌ నివ్వగా పొత్తూరు సర్పంచ్‌ జగన్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ.. భద్రగిరి టైటిల్‌ చాలా ఫోర్స్‌ గా ఉంది. ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని ఎలిమెంట్స్‌ తో ఉండే కమర్షియల్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ అని టైటిల్‌ ద్వారా తెలుస్తోంది అని అన్నారు

. చిత్ర దర్శకుడు జనార్ధన్‌ బోదాసు మాట్లాడుతూ.. భద్రగిరి నా రెండో సినిమా. జబర్దస్త్‌ టీమ్‌ చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే విధంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. వచ్చే నెల రెండో వారం నుంచి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం. మా ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు. హీరో మోహన్‌ కష్ణ మాట్లాడుతూ.. చాలా రోజులుగా దర్శకుడు జనార్ధన్‌ బోదాసు గారితో పరిచయం ఉంది. కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ప్రారంభించాం. టైటిల్‌ తగ్గట్టుగా నా పాత్ర చాలా ఫోర్స్‌ తో ఉంటుంది. జూన్‌ లో తొలి షెడ్యూల్‌ ప్రారంభిస్తాం అని తెలిపారు.