భగవత్తత్వమే దత్తాత్రేయం-2

Dathatreya1
Dathatreya1

భగవత్తత్వమే దత్తాత్రేయం-2

(నిన్నటి తరువాయి) ద్ధసనాతనులు-త్రిమూర్తుల అవతారము. త్రిపురారి. నిత్యం భాగీరధీతీరంలో కొల్హాపూర్‌లో భిక్ష చేసే వారు. ఆయనది నిగూఢమైన యోగలీల. దయామయులు. ముఖ్యశిష్యుడు కల్యాణస్వామి. ఆనంద సంప్రదాయానికి మూలపురుషుడు దత్త సంప్రదాయంలో కలియుగానికి ముందు స్వామికి 16అవతారాలున్నాయని నానుడి. శ్రీవాసుదేవానంద సరస్వతీ స్వామివారు రచించిన దత్తపురాణంలో మునులకు దత్తుడు ప్రసాదించిన సగుణ సాక్షాత్కారాలనే ఆయన అవతారాలని కీర్తించారు. అత్రిమహర్షి వాతాశనుడై యోగిరాజును ధ్యానించాడు.

దేవాసురులు త్రిమూర్తులను శరణు వేడగా త్రిమూర్తులు అత్రి ఆశ్రమానికి చేరి ఆయనను మేల్కొలిపారు. అత్రి ముని వారితో నేను ఒక్కరినే ధ్యానిస్తే ముగ్గురు వచ్చారేమి అనగానే నీవ్ఞ ధ్యానించిన అద్వితీయుని రూపాలమే మేము ముగ్గురమూ ఒకటే. సృష్టి కార్యాలను నెరవేర్చడానికి త్రిగుణాలనాశ్రయించి ముమ్మూర్తులుగా వెలిశాము. నీవ్ఞ ముందుగా చూచిన రూపాన్నే ధ్యానించు అన్నారు. ఆశ్రమంలో అత్రి తపస్సుకు మెచ్చి భగవంతుడు వరం కోరుకోమన్నాడు. నీవంటి కొడుకు కావాలి అన్నాడు బుషి. మాట ఇచ్చాను గదాయని తనంత వాడు లేనందువలన తనను తానే దత్తం చేసుకున్నాడు భగవానుడు. అత్రి, అనసూయా దంపతులు ప్రణమిల్లినారు.

తమ గర్భజనితుడైన బిడ్డకావాలని, సాక్షాత్కరించిన రూపం భూమిపై నిలిచి పోవాలనీ కోరారు. ఆశ్రమంలో యోగాగ్ని దహింపబోగా దత్తుడు బుషి శిరస్సుపై చేరాడు. చల్లదనం కల్గినది. బుషి కన్నుల నుండి కాంతి వెడలి బుతుస్నాతయైన అనసూయ దేహంలో ప్రవేశించింది. అదిమార్గశిరమాసం. పూర్వార్థంలోని సప్తమి. గర్భస్థుడైన భగవానుడు 9 దినాలను 9మాసాలని తలంచి ”మార్గశిర పూర్ణిమా బుధవారం నాడు మృగశిర నక్షత్రంలో సాయంత్రం వేళ జన్మించాడు. సృష్టి పులకించినది

. ప్రభువ్ఞ చంద్ర-దత్త-దూర్వాసుల రూపంలో దర్శనమిచ్చాడు. త్రిమూర్తాత్యత్మకుడైన బిడ్డను చూసి పొంగిపోయారు. భగవంతుడు వారిని సంతోషపరిచాడు. భగవద్గీతలో గీతాచార్యుడు ”మాసానాం మార్గశీ ర్షోహంఅని మార్గశిర మాస విశిష్టతను తెలిపారు. యోగి జనవల్లభుడైన దత్తుడు అనసూయ గర్భాన జన్మించాడని తెలిసి సిద్ధ గంధర్వాదులు-యోగులు దర్శింపరాగా ఆయన బాల్యరూపాన్ని విడిచి తేజోమూర్తిగా దర్శనమిచ్చి దానిని ధ్యానించమన్నాడు. తరించండి అన్నాడు. నాకు జన్మ-కర్మ-గుణ-రూప-మాయ-నాశాలు లేవన్నాడు. సర్వవ్యాపిని. కావ్ఞన మార్గశిరపూర్ణిమ గురువారం మధ్యాహ్నం అర్ఘ్యం-ముత్యాలు-పంచభక్ష్యాలు అర్పించి ఓం యోగి జనవల్లభాయ నమః అని జపం చేయాలి. ఈయన దేహంలోని కుడిపార్శ్వము గురువ్ఞ. ఎడమ పార్శ్వము భగవంతుడు.

కుడిచేతిలో మంత్రాకాధారమైన 52పూసల జపమాల. ఢమరులో శాస్త్రాలున్నాయి. చక్రము బంధవిచ్ఛేదము చేసి జ్ఞానతేజాన్ని ప్రసాదిస్తుంది. ఇవి కుడివైపున ఉంటాయి. ఎడమచేతిలో కర్మఫలాన్నిచ్చే కర్మసూత్రమనే జలాన్ని కల్గిన కలిశమున్నది. జీవ్ఞలకన్నపానా దులనందిస్తుంది. త్రిశూలము శంఖం సృష్టి పాలన చేస్తాయి. ఇదే భగవతత్వం. దత్తుని మూడు అర్ఘ్యాలతో పూజించి అరటిపండ్లు నైవేద్యం ఇచ్చి స్తోత్రం-లీలాశ్రవణం చేయాలి. జ్ఞానప్రదీపకుడు. శ్లోII అద్వయానంద రూపాయ-యోగమాయా ధరాయచ యోగిరాజాయదేవాయ-శ్రీదత్తాయ నమో నమఃII దిగంబరా-దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా విశ్వగురుడు దత్తాత్రేయుడు.

– పి.వి. సీతారామమూర్తి