భక్తులతో కిటకిటలాడిన వైకుంఠం కాంప్లెక్స్‌

Devotees in tirumala
Devotees in tirumala

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. దీంతో వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వ దర్శనానికి 22 గంటల సమయం పడుతున్నది. టైమ్‌ స్లాట్‌ టోకెన్‌ పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 88 వేల మంది దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి ఆదాయం రూ. 3 కోట్లు.