భక్తవత్సలునికి 108 వార్షికములు

bhaktavastal temple
bhaktavastal temple

భక్తవత్సలునికి 108 వార్షికములు

సాయిబాబా రాజమండ్రి అనగానే టెంబేస్వామి రాజమండ్రి నుండి పంపిన శ్రీఫలం అందరికి సహజంగానే జ్ఞప్తికి వచ్చును. ఇక రాజమండ్రి టెంబేస్వామి అనగానే ఆయన ప్రతిష్టించిన ‘భక్తవత్సలుడు జ్ఞప్తికి వచ్చును. టెంబేస్వామిని వాసుదేవానంద సరస్వతిగా పేర్కొంటారు. ఆయన దత్తసాంప్రదాయమునకు చెందినవాడు. ఇంకను చెప్పవలెనంటే, అందరూ ఆయనను సాక్షత్తు దత్తాత్రేయుడే అని అంటారు. ఆయన ప్రతి సంవత్సరం చాతుర్మాస్యదీక్ష తీసుకునేవారు. ఆయన 18వ చాతుర్మాస్యదీక్ష శకసంవత్సరం 1830లో అనగా 1908లో వచ్చినది. దానిని కృష్ణాజిల్లాలోని ముక్త్యాలలో చేసిరి. అది విజయవంతమయ్యెను. ఆయన గోదావరి నదీతీరమందలి వేదవాడపల్లి యందుండి, మరునాడు దత్తజయంతి ఉత్సవము జరిపిరి. అక్కడ నుండి రాజమండ్రి చేరిరి. రాజమహేంద్రవరములో శృంగేరీ శంకరాచార్యుల వారి మఠము ఒకటి గలదు. బ్రహ్మనందస్వామి అని పిలవబడు ఒక తెలుగుయోగి అచట నున్న శంకరాచార్యులు వారి ఆదేశముతో రాజమండ్రిలో వేంచేసి యున్న వాసుదేవానందుల వారిని దర్శించినారు ‘..దయచేసి మీరిప్పుడు రాజమహేంద్రవరమున గల శంకరాచార్యుల వారి మఠములో దత్తమూర్తిని, పాదుకలను ప్రతిష్టింపవలయునని నా అభిలాష. మీరు నా ప్రార్ధనను మన్నించి ఆజ్ఞనొసగగలరని ఆశించుచున్నాను అని ప్రార్థనాపూర్వకముగా బ్రహ్మానందుల వారు వాసుదేవానందుల వారిని ప్రార్థించిన వాసుదేవానందుల వారు ఆయన ప్రార్థనను అంగీకరించినారు. అది 1909 ఫిబ్రవరి మాసము. 5వ తారీకు అనగా 1830 శత సంవత్సరము. కీలకనామ సంవత్సరం. పౌర్ణమితిధి, మాఘమాసము.

ఆనాడు వాసుదేవానందుల వారి దివ్యహస్తములతో ఆ దత్తుని విగ్రహం, పాదుకలు అచట శంకరమఠములో (రాజమండ్రినందల ప్రతిష్టించిరి. రాజమండ్రినందుల ప్రతిష్టింపబడిన దత్తునకు, వాసుదేవానందులు ఇంత పూర్వము ప్రతిష్టించిన దత్తుని విగ్రహములలో తేడా ఒకటి కన్పించిన, రాజమండ్రిలోని దత్తునకు మూడుతలలు, మూడు ముఖములు ఉండును. వాసుదేవానందులు ఇతర చోట్ల ప్రతిష్ఠించిన విగ్రహములన్నియు ఏకముఖములే. రాజమండ్రిలోని దత్తుని నామము ‘భక్తి వత్సలుడు ఆ దత్తుడు నిశ్చయముగా భక్తవత్సలుడే. ఆ దత్తమూర్తిని ప్రతిష్టించిన రోజుననే ఒక మహిళ బాధాగ్రస్తురాలై రాగా, వాసుదేవానందులు ఒక మంత్రమును తెల్పి, నిష్టతో జపింపురునిది. ఆమె అట్లు చేయగా బాధ నుండి విముక్తి పొందినది. ఇది అంతయు ఆ భక్తవత్సలుని కారుణ్యమే. ఫిబ్రవరి 10, 2017న మాఘపూర్ణిమ. భక్తవత్సలునకు 108 వార్షికములు. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా!

– పి.అప్పారావు