భక్తవత్సలుడి వ్యవహారం!

నీతి కథ

villages
villages

భక్తవత్సలుడి వ్యవహారం!

ఒక గ్రామంలో భక్తవత్సలుడు అనేవాడు జీవిస్తున్నాడు. అతడికి భార్య తప్ప నా అనేవారు ఎవరూ లేరు. అతడి చుట్టుపక్కల వారు ఎప్పటికప్పుడు అతడి యోగక్షేమాలు కనుక్కునేవారు. అయితే అతడికి ఈ పరిస్థితి ఇబ్బందికరంగా తోచేది. ‘ఏమండీ! వీళ్లు కేవలం మన మీద నిఘా పెట్టినట్లున్నారు. అందువలనే మన యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. మనం చనిపోతే మన ఇంటిని స్వాధీనపరచుకోవాలన్నది వీళ్ల ఉద్దేశం అయి ఉంటుంది అంది భార్య. భక్తవత్సలుడు అంతవరకూ బయటపడలేదు గానీ అతడి ఉద్దేశం కూడా అదే.

ఏ కారణం లేకుండా ప్రజలు తన గురించి ఎందుకు పదే పదే తెలుసుకోవాలనుకుంటారు? భార్య భర్తలకు ఆనాటి నుండి తమ ఇరుగుపొరుగువారు శత్రువ్ఞల మాదిరిగా కనిపించారు. తమ ఇంటికి తినుబండారాలు ఎవరు పంపించినప్పటికి వాటిని పరీక్షించిగానీ తినేవారు కాదు. అంతేగాక దారిన పోయేవాడిని అనుమానంగా చూసేవారు. ఇరుగుపొరుగువారికి భక్తవత్సలుడి వ్యవహారం అర్ధమైంది. అతడి నుండి తాము ఏదో ఆశిస్తున్నట్లు అతడు సందేహిస్తున్నాడు. ఎందువల్ల అతడు ఇంత అనుమానపు పక్షిగా తయారయ్యాడో వాళ్లకు అంతుపట్టలేదు. ఆనాటి నుండి వాళ్లు కూడా అతడి నుండి ఎంత దూరంలో ఉండాలో అంత దూరంలోనూ ఉంటూ వచ్చారు. ‘చూశావా! మన అనుమానమే నిజమైంది. మన వలన తమకు ఉపకారం దొరకలేదని భావించి మన ఇరుగుపొరుగు వారు క్రమంగా తమ జాగ్రత్తలో తాము ఉండడం మొదలు పెట్టారు.

అంతా మన మంచికే! అన్నాడు భక్తవత్సలుడు. ఈ సంభాషణ ఇరుగుపొరుగు వారి కంటే మరొకరి చెవిన కూడా పడింది. ఆ ప్రాంతంలో ఆకాశ సంచారం చేసున్న పార్వతీ పరమేశ్వరులు అతడి మాటలువిన్నారు. అతడికి మనసులో తపస్సు చేయాలన్న కోరికను వారు ప్రవేశపెట్టినారు. ‘నేను ఈ ప్రపంచపు బాధల నుండి మనలను బయట పడవేయించమని భగవంతుడిని ప్రార్ధిస్తాను అన్నాడు భక్తవత్సలుడు. అయితే అతడి భార్య మరో రెండు ఆకులు ఎక్కువ చదివింది కాబట్టి అతడిని తపస్సు చేసుకోవడానికి ఒప్పించింది. తపస్సు చేసుకుంటే దేవు డు ఎటూ ప్రత్యక్షమవు తాడు.

దేవుడు ఇచ్చిన వర ప్రభావంతో ఇరుగుపొరుగు వారి పొగరు అణచవచ్చు. ఇదీ భార్య ఆలోచన. ఏమైతేనేం, భక్తవత్సలుడు తపస్సుకు కూర్చున్నాడు. శివ్ఞడి గురించి అతడు అడవిలో తపస్సు మొదలుపెట్టాడు. శివ్ఞడు అతి తక్కువ సమయంలోనే భక్తవత్సలుడికి ప్రత్యక్షమయ్యాడు. ‘నాయనా! ఏం కావాలో కోరుకో! అడిగాడు శివ్ఞడు. శివ్ఞడిని అంత తక్కువ సమయంలో ప్రసన్నం చేసుకోగలిగినందుకు భక్తవత్సలుడు తనను తానే అభినందించుకున్నాడు ఆ ఉత్సాహంతో అతడు ఒక కోరిక కోరాడు. తన అభివృద్ధికి అడ్డుగా ఉన్న వారిని శివుడు తన త్రిశూలంతో పొడిచి చంపి పారేయాలి. అదీ కోరిక. శివ్ఞడు నవ్వాడు. ‘నాయనా! ఈ కోరిక నీ ఒక్కడిదేనా? నీ భార్య కూడా కోరిందా? అడిగాడు శివుడు.

నా భార్య కూడా ఇలాగే కోరమంది స్వామీ అన్నాడు భక్తవత్సలుడు. శివ్ఞడు వెంటనే తన త్రిశూలాన్ని గురిపెట్టి అతడిని గాయపరచబోయాడు. తపస్సు చేస్తోన్న స్థలం నుండి భక్తవత్సలుడు దూరంగా పోవడానికి ఒక ఉరుకు ఉరికాడు. అతడు ఉన్న చోటనే ఉంటే త్రిశూలం అతడి పొట్టలో దిగి ఉండేది. శివ్ఞడికి సాష్టాంగ నమస్కారం చేసి, ‘మహాప్రభూ! నన్ను కాదు మీరు గాయపరిచేది. నా అభివృద్ధికి ఆటంకం కలిగించేవారిని అన్నాడు భక్తవత్సలుడు. ‘నాయనా! నీవ్ఞ అద్దంలో చూసుకుంటే నీవే కనిపిస్తావు.

నీ మనస్సు అద్దంలో చూసుకుంటే నీ మనస్సు కనిపిస్తుంది. ఇరుగుపొరుగు వారు నీ క్షేమ సమాచారాలు అడుగుతున్నారే తప్ప నీ ఆస్తిలో వాటా అడగటం లేదు. కేవలం నీ అనుమాన స్వభావంతోనే ఇరుగుపొరుగు వారిని దూరం చేసుకుంటున్నావ్ఞ. నీ అభివృద్ధికి నీవ్ఞ మాత్రమే కారణం. నీకు తగిన ఇల్లాలే దొరికింది అన్నాడు శివ్ఞడు. సిగ్గుపడిపోయాడు భక్తవత్సలుడు. తల వాల్చుకుని తన ఇంటివైపు దారి తీశాడు.

– బి.మాన్‌సింగ్‌ నాయక్‌, కారంపూడి, గుంటూరుజిల్లా