బ‌డ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం

yanamala
yanamala

అమ‌రావ‌తిః బడ్జెట్‌లో సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. గురువారం ఉదయం రూ.1 లక్ష 91 వేల 063 కోట్ల‌తో రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అమరావతిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర విభజనతో ఆదాయం తగ్గిపోయిందని, సమస్యల వలయంలో కూడా రాష్ట్రాభివృద్ధికి పునాదులు వేశామని చెప్పారు. కేంద్రం నుంచి సకాలంలో సాయం అందక ఇబ్బందులు పడ్డామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో 10.96 శాతం వృద్ధిరేటు సాధించామని యనమల పేర్కొన్నారు.
బడ్జెట్ ప్రధానాంశాలు:
మొత్తం బడ్జెట్: రూ.1 లక్ష 91 వేల 063 కోట్లు
రెవెన్యూ వ్యయం: రూ.1 లక్ష 50 వేల 270 కోట్లు
క్యాపిటల్‌ వ్యయం: రూ. 28 వేల 678 కోట్లు
ఆర్థికలోటు: రూ.24 వేల 205 కోట్లు