బ్ల‌డ్ బ్యాంకులో చేతివాటం చూపిన ఉద్యోగి

chiranjeevi eye & blood bank
chiranjeevi eye & blood bank

హైద‌రాబాద్ః దాతలు రక్తదానం చేసిన తరువాత ఇచ్చే జ్యూస్‌, పండ్ల వ్యవహారంలో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో ఓ ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టులోని చిరంజీవి బ్లడ్‌ బ్యాంకులో పనిచేస్తున్న ఓ ఉద్యోగి నాలుగేళ్లుగా పండ్లు, జ్యూస్‌ విషయంలో బిల్లులు అధికంగా వేసి సంస్థ నుంచి డబ్బు తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని పసిగట్టిన నిర్వాహకుడు స్వామినాయుడు జూబ్లీహిల్స్‌ పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.