బ్లాక్‌రాక్‌ పెట్టుబడులకు భారత్‌ కీలక మార్కెట్‌!

b1

బ్లాక్‌రాక్‌ పెట్టుబడులకు భారత్‌ కీలక మార్కెట్‌!

 

న్యూఢిల్లీ, నవంబరు 3: ప్రపంచంలోనే అతిపెద్ద మనీమేనేజర్‌ సంస్థగా ఉన్న బ్లాక్‌రాక్‌ ఇంక్‌ ప్రస్తు తం భారత్‌తమకు అత్యంత కీలకమయిన మార్కె ట్‌గా భావిస్తోంది. ఆసియాలోనే అత్యంత ఎక్కువ పుష్కల వ్యాపార వనరులు భారత్‌లో ఉన్నట్లు సంస్థ అంచనావేసింది. అందుకే ఆసియా పరిధిలో తన నెట్‌వర్క్‌ను మరింత విస్తరించే యోచనతో ఉంది. ఎక్కడ బ్యాంకర్లు రుణం ఇచ్చేందుకు సంశ యిస్తున్నారో అక్కడ ఈ సంస్థ ప్రవేశించి మొత్తం పరపతిని అందించేందుకు సిద్ధంఅవుతోంది. ద్రవ్య విధాన సమీక్షలో కేంద్ర బ్యాంకులు విధి విధానాలు సరళీకృతంచేయడం వల్ల ప్రైవేటు రుణపరపతికి మరింత ముందంజలో ఉంది. ఇప్పటివరకూ ప్రపంచ వ్యాప్తంగా పదిలక్షలకోట్ల డాలర్ల సెక్యూ రిటీలను ఆఫర్‌చేసినా ఇప్పటికి కొన్నిప్రపంచ బ్యాం కులు ప్రతికూల వడ్డీరేట్లలోనే మగ్గుతున్నాయి. దీనివల్లనే ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు రుణపరపతి వల్ల మంచి లాభాలు ఉంటాయని సంస్థలు అంచనాలు వేస్తు న్నాయి. అంతేకాకుండా ఇన్వెస్టర్లు ప్రస్తుతం తక్కు వ వడ్డీరేట్‌ వాతావరణం వల్ల మరింతగా కార్పొ రేట్లు, సంస్థలకు లాభదాయకంగా ఉంటుందని అంచనా. రుణపరపతిద్వారా పెట్టుబడులకు భారత్‌ ఎంతో అనువైన దేశంగా సింగపూర్‌ సంస్థ లు ఇప్పటికీ భావిస్తున్నాయి. భారత్‌ స్థూల దేశీ యోత్పత్తి 7.1శాతంపెరిగింది. ఆసియాలోని ఇతర ప్రధాన దేశాల్లో శరవేగంగా వృద్ధిచెందుతున్న దేశం గా ఉంది. ఇక కొత్తగా వస్తున్న దివాళా నియ మావళి విధానాలు కూడా ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి. ఇక స్పెక్ట్రమ్‌ వేలం ద్వారా భారత్‌లో పెట్టుబడులకు మంచి అవకాశాలు న్నాయని బ్లాక్‌రాక్‌ భావిస్తోంది. రానిబాకీల వల్ల భారత్‌లో బ్యాంకింగ్‌ వ్యవస్థ అధ్వాన్నాంగా మారింది. అందువల్లనే బ్లాక్‌రాక్‌ వంటి సంస్థలు భారత్‌వైపు దృష్టిసారించాయి.అలాగే ఆసియాలోని అతిపెద్దదేశం అయిన చైనాలో పెట్టుబడులకు బ్లాక్‌ రాక్‌ వంటి సంస్థలు తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నా యి. అలాగే బ్లాక్‌రాక్‌ తన ప్రైవేటుక్రెడిట్‌టీమ్‌ను ఆసియాలో పెంచుకున్నది. హడ్జ్‌ఫండ్‌ మాజీ మేనే జర్‌ జస్టిన్‌ ఫెరీర్‌ను ఎండిగా ఈ ఏడాదిప్రారంభం లోనే నియమించింది. బ్యాంకింగ్‌ రంగంలో ఎదు రవుతున్న సవాళ్లు సమస్యలను పరిగణనలోనికి తీసుకుని వాటినుంచి పెట్టుబడులపరంగా భారత్‌ లో మరింతముందుకు వెళ్లేందుకుబ్లాక్‌రాక్‌ చూస్తోంది.