బ్రెయిన్ ఫుడ్
మన మేధస్సు పెరగాలన్నా, మన జ్ఞాపకశక్తి పెరగాలన్నా మనం తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏమిటి? ఏఏ ఆహార పదార్థాలు తీసుకుంటే మన మెదడు చురుకుగా ఉంటుంది.
ఈ విషయం మీద అనేక పరిశోధనలు చేసి మేధస్సు పెరగాలన్నా, మన మెదడు చురుకుగా పని చేయాలన్నా ఏ ఆహారం తీసుకోవాలో ఓ నిర్ణయానికి వచ్చారు పరిశోధకులు. అసలు బ్రెయిన్ ఫుడ్ అంటే…
విటమిన్-సి మన మెదడులోని నాడీకణాలు ఆరోగ్యంగా ఉండటంతో విటమిన్ ‘సి’ తోడ్పడుతుంది. ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్. నిమ్మ, నారింజ, బత్తాయి, క్యాబేజీ, బంగాళదుంపలలో ఇది లభ్యం అవుతుంది.
విటమిన్ ‘ఇ’ ఎక్కువగా లభించే ఆహారం తీసుకుంటే అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు. మన శరీరంలో ఫ్రీరాడికల్స్ అనేవి వాటి ఇష్టానుసారం తిరుగుతూ ఉంటాయి.
వీటి కారణంగా దెబ్బతిన్న మెదడు కణాలను సరిదిద్దడంలో ‘ఇ’ విటమిన్ మెరుగైన పాత్ర వహిస్తుంది. విటమిన్ ‘ఇ’ తక్కువైతే జ్ఞాపకశక్తి తగ్గుతుంది. విటమిన్ ‘ఇ’ లభించే ఆహారపదార్థాలు ఏమిటంటే… మామిడి, పొద్దుతిరుగుడు గింజలు, కాలీఫ్లవర్, వేరుశనగపప్పు మొదలైనవి.