బ్రూస్లీని చూసినట్టుంది: నాగ్‌

EK AUDIO FUNCTION
EK AUDIO FUNCTION

కె వరల్డ్‌ మూవీస్‌ బ్యానర్‌పై రుద్రారపు సంపత్‌ దర్శకత్వంలో బిష్ణు, హిమంశి కురానా, అపర్ణశర్మ హీరో హీరోయిన్లుగా నిర్మాత హరికృష్ణ నిర్మించిన చిత్రం ‘ఏక్‌.. మంత్ర ఆనంద్‌ సంగీత సారధ్యంలో రూపుదిద్దుకున్న ఆడియోను కింగ్‌ నాగార్జున ఆవిష్కరించారు. ఆడియో సిడిని ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. హీరో బిష్ణుని చూస్తుంటే నాకు15 ఏళ్ల వయసులో బ్రూస్లీని చూసినట్టుఉందని అన్నారు. చూడగానే డ్రాగన్‌ గుర్తుకొచ్చిందన్నారు. చాలా సంతోషంగా ఉందన్నారు. ఇపుడు వస్తున్నకుర్రవాళ్లు చాలా టాలెంటెడ్‌గా ఉంటున్నారన్నారు. అందరికీ ఏక్‌ అనే నెంబర్‌ఎంత ఇష్టమో ఈసినిమా కూడ అదేస్థాయిలో నిలబడాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. తొలిసారిగా సినిమాను డైరెక్టు చేసిన సంపత్‌కు, నిర్మాత కృష్ణకు ఆల్‌దిబెస్ట్‌ అన్నారు. హీరో బిష్ణు మాట్లాడుతూ, ఇది ఫాస్ట్‌ ఫెస్డ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ విత్‌ లవ్‌ స్టోరీ అన్నారు. టీం అంతా కష్టపడి పనిచేశామన్నారు. దర్శకనిర్మాతలు మాట్లాడుతూ, మానవీయ విలువలతో మంచి కాన్సెప్ట్‌తో ఈచిత్రం తెరకెక్కించటం జరిగిందన్నారు. అందరికీ తప్పకుండా నచ్చుతుందన్నారు.