బ్రయాన్‌ ఆడమ్స్‌ షోలో..

Priyanka chopra
Priyanka chopra

బ్రయాన్‌ ఆడమ్స్‌ షోలో..

అంతర్జాతీయ రాక్‌స్టార్‌ కెనడియన్‌ సింగర్‌ బ్రయాన్‌ ఆడమ్స్‌త్వరలో భారత దేశానికి వస్తున్నారు.. అక్టోబర్‌ 9 నుంచి 14 దాకా ఆయన అహ్మదాబాద్‌, హైదరాబాద్‌, ముంబై , బెంగళూరు, ఢిల్లీల్లో కాన్సర్టుల్లో పాల్గొంటారు. ఇప్పటికే అహ్మదాబాద్‌లో అమితాబ్‌ బచ్చన్‌, హైదరాబాద్‌లో ప్రభాస్‌ హోస్టులుగా వ్యవహరించే అవకాశం ఉందని ఇప్పటికే రూమర్లు వచ్చాయి. ఇదిలా ఉంటే. ఆడమ్స్‌ ఓపెనింగ్‌ షోకు ఆస్కార అవార్డు విన్నర్‌ ఎఆర్‌ రెహమాన్‌ , గ్లోబల్‌ సుందరి ప్రియాంక చోప్రా పాల్గొంటారని ఓజాతీయ పత్రిక ప్రచురించింది.. ఆమె మూడు నగరాల్లో పాల్గొనున్నారని , ఆడమ్స్‌ గతంలో ప్రియాంకతో కలిసి పనిచేసి ఉండటం, ఆయనకు రెహమాన ఒక ఫేవరేట్‌ మ్యూజిషియన్‌ కావటంతో నిర్వాహకులు వాళ్లను కూడ షోకోసంప్రదించినట్టు తెలిసింది.. త్వరలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.