బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో అమెజాన్‌ ఒప్పందం

amazon1

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో అమెజాన్‌ ఒప్పందం

న్యూఢిల్లీ,సెప్టెంబరు 18: ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ తమ ప్లాట్‌ ఫాంపై ఉత్పత్తులు విక్రయించే విక్రేతలకు సూక్ష్మ రుణాల సహకారం అందించే దిశగా ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో ఒప్పందం కుదర్చుకుంది. ఇన్వైట్‌ ఓన్లీ(ఆహ్వానం) ప్రాతిపదికన మాత్రమే విక్రేతలకు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.బ్యాంక్‌ తోడ్పాటుతో జులైలో అమె జాన్‌ ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిం చింది. వార్షికంగా 10.45-11.5 శాతం వరకు వార్షిక వడ్డీ రేటుపై లక్ష నుంచి 25 లక్షల వరకు రుణ లభ్యత ఉండగలదని అమెజాన్‌ ప్రకటించింది.

చిన్న, మధ్య తరహా సంస్థల వ్యాపార అవస రాలపై మంచి అవగాహన ఉన్నందున అమెజాన్‌ ఇండియాలో 2 లక్షల మంది పైగా విక్రేతలకు సమగ్రమైన బ్యాంకింగ్‌ సేవలు అందించే దిశగా ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఎండి పిఎస్‌ జయకుమార్‌ పేర్కొన్నారు.వచ్చే సంవత్సరం వ్యవధిలోగా 15-20 శాతం మంది అమెజాన్‌ సెల్లర్లు ఈ సదుపాయం ఉపయోగించు కునే అవకాశం ఉన్నట్లు వివరించారు.అమెజాన్‌ పోర్టల్‌లో విక్రయాల ట్రాక్‌ రికార్డు, కస్లమర్స్‌ ఫీడ్‌ బ్యాక్‌,నిబంధనలను పాటించడం మొదలైన అంశాల ప్రాతిపదికగా విక్రేతలకు ఈ పథకం కింద రుణ అర్హత వివరా లతో ప్రీ-అప్రూవ్డ్‌ ఆఫర్‌బ్యాంక్‌ నుంచి అందుతుంది. కార్యకలాపాలు విస్తరించే క్రమంలో వ్యాపార సంస్థలు ఎదుర్కొనే నిధుల కొరత సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో ఈ పథకం అందుబాటులోకి తెచ్చినట్లు అమెజాన్‌ ఇండియా డెరెక్టర్‌ గోపాల్‌ పిళ్లై తెలిపారు