బ్యాంకుల బలోపేతంపై ఆర్‌బిఐ దృష్టి

RBI---
RBI—

బ్యాంకుల బలోపేతంపై ఆర్‌బిఐ దృష్టి

ముంబై: బ్యాంకింగ్‌ రంగంలో ఆర్థికంగా బలహీనంగా ఉన్న బ్యాంకుల విష యంలో పిసిఎ (ప్రాంట్‌ కరక్టివ్‌ యాక్షన్‌) పరిధిలో రిజర్వ్‌బ్యాంకు కొన్ని మార్పులను చేసే అవకాశం ఉంది. బ్యాంకింగ్‌ సిస్టమ్‌లో లోపాల ను సరిదిద్దేందుకు రానున్న కాలంలో ఈ దిద్దు బాట్లు జరుగుతాయని నిపుణలు పేర్కొంటు న్నారు. ఈ అంశాలపై, సమస్యలపైన ఇటీవల ఆర్‌బిఐ బోర్డు సమావేశంలో కొంతమేరకు చర్చజరిగింది. ఆర్‌బిఐ ఈ దిద్దుబాటు చర్యలకు కొన్ని బ్యాంకులను ఎంపిక చేసినట్లు సమాచారం. మొత్తం 21 బ్యాంకుల్లో 11 బ్యాంకులకు తప్పనిసరిగా నిబంధల విషయంలో మార్పులు చేయాలని ఆర్‌బిఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. దేనా బ్యాంకు, అలహాబాద్‌బ్యాంకు ఈ రెండు బ్యాంకులు కార్యకలాపాల విస్తరణ విషయంలో కొన్ని పరిమితులను, షరతులను ఎదుర్కొంటు న్నది. అందువల్ల పిసిఎ నిబంధనలను సవరిం చాలని ఆయా బ్యాంకులు గట్టిగా కోరాయి. త్వర లోనే నిబంధల్లో మార్పులు చేస్తామని బ్యాంకుల కు హామీ ఇచ్చారు. ఎన్‌పిఎలు బాగా పెరగడం, మొండిబకాయిలు పట్టిపీడించడం వంటి సమస్య లు ఎదురవుతున్నాయి. ఎస్సార్‌స్టీల్‌, భూషణ్‌ పవర్‌, స్టీల్‌ లిమిటెడ్‌ వంటి కంపెనీలలో పేరుకు పోయిన బకాయి లను రాబట్టేందుకు కొన్ని చర్యలను ఆర్‌బిఐ సూచించినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం కంటే బ్యాంకులు ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 365.51బిలియన్లు మొండి బకాయి లను రికవరీ చేశాయి. దీని వల్ల 11.5 శాతం ఆపరేటింగ్‌ ప్రాఫిట్‌ పెరిగి నష్టా లు పరిమితమయ్యాయి. ఆర్‌బిఐ దృష్టి లో ఉన్న 11 బ్యాంకులు ఇవి దేనా బ్యాంకు, అలహాబాద్‌ బ్యాంకు, యునై టెడ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కార్పొ రేషన్‌బ్యాంకు, ఐడిబిఐబ్యాంకు,యూకో బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంకు, ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, బ్యాంకు ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ ఓవర్సిస్‌ బ్యాంకు. రాబోయే రోజుల్లో ఆయా బ్యాంకుల నిబంధనలు ఏ విధంగా మార తాయో, ఏ మార్పులు జరుగుతాయో వేచి చూడాలి.