బ్యాంకుల్లో డిపాజిట్లపై ఐటి నిఘా నేత్రం!

b6
deposites

బ్యాంకుల్లో డిపాజిట్లపై ఐటి నిఘా నేత్రం!

న్యూఢిల్లీ, నవంబరు 10: పెద్దనోట్ల చెలామణి రద్దు చేసిన పుణ్యమా అని లెక్కలు తేలని గుప్తనిధులు ఉన్నవారికి మాత్రం ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రభుత్వం ప్రస్తుతం బ్యాంకుల్లో డిపాజిట్‌ అవు తున్న సొమ్ముపైనిశితంగా పరిశీలనచేస్తోంది. నిఘా వ్యవస్థను అప్రమత్తంచేసింది. ఐటి అధికారులైతే మరింత లోతుగా దర్యాప్తులుచేస్తున్నారు. 2.5లక్షల పరిమితిని దాటి డిపాజిట్లు ఉంటే 30శాతం పన్నుతోపాటు అదనంగా 200శాతం జరిమానా కూడా తప్పదని ప్రభుత్వం ప్రకటించింది. కస్టమర్లుడిపాజిట్‌చేసిన సొమ్ముకువారు ప్రకటించిన ఆదాయ వనరులకు పొంతన లేకుండా ఉన్న పక్షంలో 30 శాతం పన్నుతోపాటు 200శాతం జరిమానా తప్ప దని ప్రభుత్వం ముందురోజే ప్రకటించింది. డిపా జిటర్లు దాఖలుచేసిన ఆదాయపు రిటర్నులను ఐటి శాఖ క్రోడీకరించి పరిశీలనచేస్తోంది. మిస్‌మ్యాచ్‌ ఉంటే పన్నుల ఎగవేతకింద భావించి కఠిన జరి మానా ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి హస్‌ముఖ్‌ అధియా వెల్లడించారు. చిన్నచిన్న వ్యాపారులు, గృహిణులు, చేతివృత్తులవారు, కార్మికులు వంటి వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని, వారు పన్నుఅధికారుల పరిశీలనపరిధిలోనికి రానేరారని భరోసా ఇచ్చారు. కొనుగోలుదారుల నుంచి పాన్‌నం బర్లు తీసుకోని జ్యుయెలర్లపై కూడా కఠిన చర్యలు ఉంటాయి. ఆర్థికశాఖ హెచ్చరికలు జారీచేసినా బుధ వారం గురువారాలు కొనుగోళ్లు భారీగానే జరిగాయి. జ్యూయెలర్ల నగదు డిపాజిట్లు, వారివారి షాపుల్లో కొనుగోలుదారులు చేసిన మొత్తాలకు సరిపోల్చు తున్నారు. అంతేకాకుండా వారి పాన్‌నెంబరు తీసు కోనిపక్షంలో వ్యాపారులపై చర్యలు ఉంటాయని చెపుతున్నారు. పాతచెల్లని నోట్లు డిపాజిట్‌చేసినంత మాత్రాన వారికి ఎటువంటి పన్ను మినహాయిం పులు ఉండవని పన్నుచట్టాలు యధాప్రకారం అమలవుతాయని రెవెన్యూ కార్యదర్శి వివరించారు. 50వేల రూపాయలకుపైబడిన అన్ని డిపాజిట్లకు పాన్‌కార్డులు చూపించాలని ఆ్యంకులు కోరుతున్నా యి. ఈ సమాచారం పన్నులశాఖ పరిధిలోనికి వెళు తుంది.
అయితే పాతనోట్ల డిపాజిట్లకు సంబంధించి ప్రభుత్వం 2.5 లక్షల వరకూ మినహాయింపునిచ్చిం ది. బ్యాంకులు శని ఆదివారాలతోపాటు అవసర మైతే సోమవారం కూడా అదనపు పనివేళలతో పని చేస్తాయి. ఆర్‌బిఐకొత్త రూ.500నోట్లు, కొత్త రూ.2 వేల నోట్లు జారీచేస్తోంది. రైల్వే, మెట్రో స్టేషన్లు, టోల్‌గేట్లలో పాతనోట్లను తీసుకోవచ్చని మార్గదర్శ కాలు జారీచేసినా తక్కువ విలువలున్న నోట్లు లేక పోవడం వల్ల అన్నిచోట్లా చేతులెత్తేసారు. ఇక కొత్త నోట్లతో ఎటిఎంలు ఎప్పటికప్పుడు రీఫిల్లింగ్‌ అవు తుంటాయని ఆర్థికసేవల కార్యదర్శి అంజులి చిబ్‌ దుగ్గల్‌ పేర్కొన్నారు. బ్యాంకులు కూడా మరిన్ని కౌంటర్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. ఆర్‌బిఐ తో ఆర్థికశాఖ నిరంతరం సంప్రదింపులు జరుపుతూ నగదును అందుబాటులో ఉంచేందుకు వీలుగా చర్య లు తీసుకుంటున్నదన్నారు. పాతనోట్లు డిపాజిట్‌కు పరిమితులు ఉండవని పాతనోట్లు స్థానంలో కొత్త నోట్లు మాత్రం నాలుగువేల చొప్పున ఇస్తారని ఈ విధానం నవంబరు 24వ తేదీవరకూ జరుగుతుం దని అంచనా. బ్యాంకుల నుంచి రోజుకు పదివేల రూపాయలు, వారంలో 20వేలకు మించకుండా విత్‌ డ్రా చేసుకోవచ్చని అంచనా. ఎటిఎంలనుంచి రోజుకు రెండువేలు చొప్పున విత్‌డ్రాచేసుకునే వెసులుబాటు ను కల్పించారు. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుపరంగా పాతనోట్లు వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధివిధా నాలపై కసరత్తులు చేస్తోంది. ఆదాయపు పన్నుశాఖ బ్యాంకులతో కలిసిఆర్థికనిఘా విభాగాన్ని పటిష్టం చేసి అనుమానిత లావాదేవీలను గుర్తించే పనిలో పడింది.