బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

bse1
sensex

బ్యాంకింగ్‌ షేర్ల ర్యాలీ

ముంబై, నవంబరు 10: స్టాక్‌మార్కెట్లలో ముందురోజు నెలకొన్న అనిశ్చితినుంచి పూర్తి గా కోలుకున్న స్టాక్‌ మార్కెట్లు గురువారం 265 పాయింట్లు లాభాలతో ముగిసాయి. బ్యాంకింగ్‌ స్టాక్స్‌ ఎక్కువగా ర్యాలీతీసాయి. బ్యాంకుల్లో డిపా జిట్లు పెరుగుతాయని, ఎక్కువ విలువలున్న బ్యాంక్‌ నోట్లు రద్దుకారణంగా కేంద్రం కొత్తనోట్ల జారీకి చర్యలు తీసుకుంటున్నందున బ్యాంకింగ్‌ ష్టాక్స్‌ ర్యాలీ తీసాయి. అంతేకాకుండా అమెరికాఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడాన్ని కూడా ఇన్వెస్టర్లు సానుకూలంగా భావించడం ఒకకారణంగా మారింది. స్వల్పకాలిక రికవరీ ఎక్కువ కనిపించింది. ఆసియా మార్కెట్లు, యూరోపియన్‌ మార్కెట్లలో కూడా వృద్ధి కనిపించింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్లు పన్నుల తగ్గింపులపై ఆశలు పెరిగాయి. ఇన్‌ఫ్రా, రక్షణరంగ వ్యయాలకు సంబంధించి పన్నుల్లో మినహాయింపులు ఎక్కువ ఇవ్వవచ్చ న్న ఆశలు పెరిగాయి. అలాగే ట్రంప్‌ ఎన్నిక కూడా మరింతసానుకూలంగా భావించారు. సెన్సెక్స్‌ 265.15 పాయింట్లు లాభతో 27,517.68 పాయింట్లవద్ద నిలిచింది. ఇంట్రాడేలో 27,743.46 పాయింట్ల నుంచి 27,457.05 పాయింట్ల వరకూ పెరిగిన సెన్సెక్స్‌ చివరకు 265 పాయింట్ల లాభంతో ముగి సింది. 50షేర్‌ నిఫ్టీ సూచి కూడా 8500 పాయింట్లవద్ద నిలిచింది. 525.75 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ ముగించింది. 93.75 పాయింట్లు లాభపడింది. ఒక దశలో 8598 పాయింట్ల నుంచి 8510.70 పాయింట్ల వరకూ కదిలింది. ఆర్థికరంగ కంపెనీల సేర్లు ఎక్కువ పనితీరు చూపాయి. ఇన్వెస్టర్లు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా,పంజాబ్‌నేషనల్‌బ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌బరోడా, ఎస్‌బిఐ, కెనరాబ్యాంకు, ఎస్‌ బ్యాంకు ఫెడరల్‌బ్యాంకు, ఐసిఐసిఐబ్యాంకు, యాక్సిస్‌బ్యాంకు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు భారీగాపెరిగాయి. 13.71శాతంగాఉంది. నిఫ్టీ బ్యాంకుసూచి 3.49 శాతంపెరిగింది. బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్‌సూచి 1.75శాతంపెరిగింది. మిడ్‌క్యాప్‌ సూచి 1.65శాతంగా పెరిగింది. ముందురోజు 2095కోట్ల షేర్లు విక్రయించిన ఇన్వెస్టర్లు గురువారం కొనుగోళ్లు జరిపారు. అంతర్జాతీయంగా చూస్తే జపాన్‌ నిక్కీ 6.72శాతం పెరిగింది. హాంకాంగ్‌ హ్యాంగ్‌సెంగ్‌ 1.89శాతం పెరిగితే చైనాషాంఘై కాంపోజిట్‌ సూచి 1.37శాతం పెరిగింది. యూరోపియన్‌ మార్కెట్లలో లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 0.3శాతంగా ఉంది. ప్యారిస్‌లో 0.96శాతంగాఉంది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో 0.76శాతం గా ముగిసింది. ఇంట్రాడే సెన్సెక్స్‌లో మార్కె ట్లు 490 పాయింట్లవరకూ పెరిగినట్లు అంచనా. ఇందుకు ప్రధానంగా ఐదుకారణాలు కనిపిస్తున్నా యి. దేశీయంగా మార్కెట్లుఆసియా, వాల్‌స్ట్రీట్‌ మార్కె ట్ల ప్రభావంచూపించింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్లకు భారత్‌లోమౌలిక రంగం, రక్షణరంగాలపెట్టుబడులపై పన్నురాయితీఉంటుందన్న ఆశలుపెరిగా యి. జపాన్‌నిక్కీ పటిష్టంఅయింది. భారత్‌లోని ఎక్కువ విలువలున్న బ్యాంక్‌నోట్లు రూ.500, రూ.1000 నోట్లరద్దుపై ఇన్వెస్టర్లు పెద్దగా వెనుకంజవేయాలేదు. అయితే రియాల్టీ సూచి మాత్రం భారీగా నష్టపోయింది. ఇక మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ స్టాక్స్‌లో లాభాలు కనిపించింది. జిందాల్‌ స్టీల్‌, టాటాస్టీల్‌, హిందాల్కో కంపెనీలు లాభాల్లో కొనసాగాయి. బ్యాంకింగ్‌రంగ షేర్లు భారీగా పెరిగాయి.