బ్యాంకింగ్‌, విద్యుత్‌రంగ షేర్ల మద్దతు

BSE
BSE

ముంబయి: బెంచ్‌మార్క్‌స్టాక్‌మార్కెట్‌సూచీలు రెండోరోజుసైతం ఎగువ ప్రాంతంలోనే ముగిసాయి. మంగళవారం బ్యాంకింగ్‌,విద్యుత్‌రంగ స్టాక్స్‌ కొంతమద్దతునిచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నష్టాలు ఎదురైనా, యుఎస్‌చైనాలమధ్య వాణిజ్యయుద్ధభయాలున్నా భారత్‌మార్కెట్లుప్రకాశించాయి. బ్యాంకింగ్‌షేర్లు బాండ్‌ట్రేడింగ్‌ నష్టాలను తగ్గించుకునేందుకు అనుమతించడం, ఆర్‌బిఐ ఎంపిసి కమిటీ రెపోరేట్ల సమీక్షపైనా ఎక్కువ ఇన్వెస్టర్లు ఆసక్తిచూపించారు. కేంద్ర బ్యాంకు రెపోరేట్లను స్థిరంగానే కొనసాగిస్తుందని, కొత్త ఆర్ధికసంవత్సరంలో మొదటి సమీక్షలో రేట్లు యధాతథంగా కొనసాగిస్తుందన్నారు. బిఎస్‌ఇసెన్సెక్స్‌ 115.27 పాయింట్ల ఎగువన 33,370.63 పాయింట్లవద్ద స్థిరపడింది. నిఫ్టీ 50సూచీ 33.20 పాయింట్లవద్ద లాభపడి 10,245వద్ద స్థిరపడింది. మొత్తం బిఎస్‌ఇలోని 19 విభాగసూచీల్లో 16 సూచీలు లాభాల్లోనే ముగిసాయి. విద్యుత్‌, బ్యాంకింగ్‌,యుటిలిటీసూచీలు ఎక్కువ లాభపడ్డాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌సూచీ 0.92శాతం మెరుగుపడితే స్మాల్‌క్యాప్‌సూచీ 1.35శాతం లాభపడింది.ఐసిఐసిఐబ్యాంకు, ఎంఅండ్‌ఎం, ఎస్‌బ్యాంకు, పవర్‌గ్రిడ్‌ సంస్థలు ఎక్కువ లాభాలనునమోదుచేసాయి. విప్రో, ఒఎన్‌జిసి, ఆదానిపోర్టులు, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకులు నష్టాలపాలయ్యాయి. ఈస్టర్‌ శెలవులనుంచి మార్కెట్లకు ఇన్వెస్టర్లు ఇపుడిపుడే వస్తుండటంతో యూరోప్‌ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోనేముగిసాయి. వాల్‌స్ట్రీట్‌ మందగమనం టెక్నాలజీ సెక్టార్‌పై ఎక్కువ ప్రబావంచూపించింది. ఎక్కువ భాగం ట్రేడ్‌వార్‌పైనే నడిచాయి. లండన్‌ ఎఫ్‌టిఎస్‌ఇ 0.8శాతం నష్టపోయింది. యూరోజోన్‌లో జర్మనీ డాక్స్‌ సూచీ 0.8శాతం క్షీణిస్తే ఫ్రాన్స్‌ సిఎసి 0.5శాతం లాభపడింది. మొత్తం అన్ని యూరోపియన్‌ మార్కెట్లు శుక్రవారం, సోమవారాలు శెలవులు ప్రకటించాయి. ఇన్వెస్టర్లు నాలుగురోజులపాటు ఈస్టర్‌ శెలవుల వారాంతాన్ని గడిపారు. ఇక మార్కెట్లలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 413.16 కోట్లు పెట్టుబడులుపెడితే విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు 689.75 కోట్ల విలువైన వాటాలను విక్రయించినట్లు డిపాజిటరీస్‌ గణాంకాలుతెలుపుతున్నాయి. ఇకబులియన్‌ మార్కెట్‌లో పదిగ్రాముల బంగారం రూ.150 పెరిగి 31,610కిచేరింది. వెండిధరలుసైతం కిలోకు రూ.225 పెరిగి రూ.39,600వరకూ పెరిగినట్లు అంచనావేసింది. పారిశ్రామిక యూనిట్లు, నాణేల తయారీదారులు కొనుగోళ్లు పెంచడమే ఇందుకుకీలకం. ఇక బ్యాంకింగ్‌ రంగంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లుసైతం పెరిగాయి. ఉత్పత్తిరంగంలో ఐదునెలల కనిష్టంగా ఉన్నట్లు గణాంకాలు స్పష్టంచేయడం ఉత్పత్తిరంగంలో వృద్ధి మందగించడం వంటివిజరిగాయి. నిక్కీ పిఎంఐసూచీ ఐహెచ్‌ఎస్‌మార్కిట్‌ సర్వే మార్చినెలలో 52.1 పాయింట్లనుంచి 51.పాయింట్లకుపడిపోయింది. రిజర్వుబ్యాంకుమానిటరీపాలసీ సమీక్షపైనే ఇన్వెస్టర్లు ఎక్కువ గురిపెట్టారు. ఆసియా మార్కెట్లలో ప్రపంచ మార్కెట్ల అమ్మకాల ప్రభావంఎక్కువ కనిపించింది. మంగళవారం ఇన్వెస్టర్లు తమకు అనువైన రంగాలను ఎంచుకున్నారు. అమెరికా,చైనాల ట్రేడ్‌వార్‌లే ఇందుకుకీలకమని అంచనా.