బ్యాంకర్లతో ఆర్‌బీఐ గవర్నర్‌ సమావేశం

 shaktikanta das
shaktikanta das

న్యూఢిల్లీ: ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ ఈరోజు ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల సీఈవోలతో సమావేశమయ్యారు. బ్యాంకింగ్‌ రంగం నుండి ప్రభుత్వం ఏమి కోరుకుంటుందో అనే విషయాన్ని తెలిపారు. ఫిబ్రవరి 7వతేదీన ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ ఆరో పరపతి విధాన సమీక్ష నిర్వహించనుంది. బ్యాంకింగ్‌ రంగం నుండి ఆర్‌బీఐ ఏమి ఆశిస్తుందో వారికి తెలిజేయడానికి ఈసమావేశం అయ్యామని, అంతేకాక ప్రస్తుత, భవిష్యత్తు అంశాలపై చర్చంచాము,  అని శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు.