బోఫోర్స్‌ విచారణకు కొత్త సుప్రీం బెంచ్‌

SUPREME COURT
SUPREME COURT

న్యూఢిల్లీ: బోఫోర్స్‌కేసు విచారణకు మరొక బెంచ్‌కు బదలాయించాలన్ననిర్ణయం అనివార్యం అవుతున్నది. ప్రస్తుత న్యాయమూర్తి జస్టిస్‌ ఎఎం ఖాన్విల్కర్‌ ఈకేసు విచారణనుంచి వైదొలగడంతో మరో బెంచ్‌కు ఈ కేసును బదలాయించాల్సి వచ్చింది. బోఫోర్స్‌ ఆయుధసామగ్రి కొనుగోళ్లపరంగా రూ.64 కోట్లు ముడుపులు అందాయన్న ఆరోపణలతోపాటురాజకీయంగా మరింత సున్నితమైనకేసు అయినందున తాను విచారించడం సమంజసం కాదని ఖాన్విల్కర్‌ తప్పుకున్నారు. ఛీఫ్‌జస్టిస్‌ దీపక్‌మిశ్రా ఆధ్వర్యంలోని బెంచ్‌లో ఖాన్విల్కర్‌ కూడా ఒక సభ్యునిగా ఉన్నారు. అయితే తాను వైదొలిగేందుకుగల కారణాలనునమాత్రం ఖాన్విల్కర్‌ స్పష్టంచేయలేదని సమాచారం. ఇదే బెంచ్‌పై సుప్రీం ఛీఫ్‌తోపాటు జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ కూడా ఉన్నారు. వచ్చే మార్చి28వ తేదీ విచారణకు రానున్న బోఫోర్స్‌ విచారణకోసం కొత్త బెంచ్‌ ఏర్పాటవుతుందని అన్నారు. బిజెపి నేత అజ§్‌ు అగర్వాల్‌ దాఖలుచేసిన పిటిషన్‌ వివరాలప్రకారం 2005 మే 31వ తేదీ ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో నమోదయిన అందరు నిందితులపై కేసును కొట్టివేయడాన్ని సుప్రీంలో సవాల్‌చేసారు.మరోపక్క సిబిఐ కూడా సుప్రీంకోర్టులో స్పెషల్‌ రివ్యూపిటిషన్‌ దాఖలుచేసి బోఫోర్స్‌కేసును తిరగదోడే ప్రయత్నాల్లో ఉంది.