బోనస్‌ ఇష్యూలతో ముందుకు వస్తున్న కార్పొరేట్లు

RUPEES
RUPEES

బోనస్‌ ఇష్యూలతో ముందుకు వస్తున్న కార్పొరేట్లు

ముంబయి, మే 21: ఇన్వెస్టర్లకు వివిధ కంపెనీల షేర్ల పై బోనస్‌లు వెల్లువలా వస్తున్నాయి. ప్రస్తుత అంచ నాలప్రకారం 24 కంపెనీలకుపైగా బోనస్‌ ఇష్యూ జారీచేసినట్లు అంచనా. ఈ కేలండర్‌ సంవత్సరం లో ఇప్పటివరకూ ఇదే గరిష్టసంఖ్య. ఈ24 కంపెనీ ల్లో 12 కంపెనీలు గడచిన నెలరోజులుగా బోనస్‌ ఇష్యూ జారీచేసాయి. అంతకుముందు సంవత్సరం లో 15 కంపెనీలు బోనస్‌ ఇష్యూ జారీచేసాయి. ఇప్పటివరకూ 2017 కేలండర్‌ సంవత్సరంలో 27 కంపెనీలు ఐసిఐసిఐబ్యాంకు, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి, గోద్రెజ్‌ కన్సూమర్‌, బయోకాన్‌, విప్రో కంపెనీలు బోనష్‌ ఇష్యూలుప్రకటించాయి.

మేనెలలోనే ఆరు కంపెనీలు తమ వాటాదారులకు ఈరూటులో వాటా ల కేటాయింపులుచేశాయి. ముంజాల్‌ ఆటో ఇండ స్ట్రీస్‌ కూడా ఈనెల 22వ తేదీ సమావేశం అయి నిర్ణయిస్తుంది. శిల్పి కేబుల్‌ టెక్నాలజీస్‌ తఈనెల 28 వతేదీ బోర్డు సమావేశమై బోనస్‌పై చర్చిలు జరుపుతుంది. ప్రముఖ సంస్థలపరంగా ఐసిఐసిఐ బోర్డు ఆమోదించింది. ప్రతి పదిషేర్ల కు ఒకషేరు అందిస్తుంది చగోద్రెజ్‌, పెట్రోనెట్‌ ఎల్‌ఎన్‌జి సంస్థలు కూడా నిష్పత్తిలో వాటా లను అందిస్తున్నాయి. ఇకైటిరంగం ఫార్మాకంపెనీ లు విప్రో ఏప్రిల్‌లోనేప్రకటించింది. బయోకాన్‌ సంస్థ  వాటాలను విభజిం చింది. నగదు లభ్యతను మరింతగా పెంచుకునేందు కుగాను బోనస్‌ షేర్లు కేటాయింపులు జరుపుతు న్నారు.

వాటాదారులకు కేటాయింపులతోపాటు ఈ జారీ తర్వాత స్టాక్‌ ధరలు కూడా బోనస్‌ నిష్పత్తికి అనుగుణంగా సర్దుబాటు అవుతాయి. మొత్తం కంపెనీ మార్కెట్‌ విలువలు మాత్రం అదేస్తాయిలో ఉంటాయి. బోనస్‌ జారీలో అంతరార్ధం ఏమిటంటే స్టాక్‌ ధరలు తగ్గించేందుకేనని తెలుస్తోంది. అయితే కంపెనీ ఆర్థికవనరులకు ఏమాత్రం దెబ్బతగుల కుండా జాగ్రత్తలు తీసుకుంటాయి, బోనస్‌ జారీ వల్ల కంపెనీ తీరు ఏమాత్రం మారిపోదని స్టాక్‌ ధర లు తగ్గుతాయని అన్నారు. ఐటిరంగ స్టాక్స్‌పరంగా బోనస్‌ బైబ్యాక్‌ ఈరెండింటిలో ఏదైనా అవలంభిం చే అవకాశం ఉంది.
ఇన్వెస్టర్ల సామర్ధ్యాన్ని కూడా ఈ బోనస్‌షేర్ల జారీ నిర్ణయిస్తుంది. అలాగే ఎక్ఛేం జిల ట్రేడింగ్‌ పరిమాణం కూడా పెంచుతుందని అంచనా. బోనస్‌ఇష్యూద్వారా వాటాదారులకు షేర్ల కేటాయింపుతో కంపెనీలు డివిడెండ్‌ అందించడం వంటి పద్ధతులకు స్వస్తిచెపుతాయి.

వీటివల్ల తక్కు వ స్థాయిలో డివిడెండ్‌ పంపిణీ పన్నును అందించే అవకాశం ఉంటుంది. బోనస్‌షేర్ల జారీలో రిటైల్‌ ఇన్వెస్టర్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుందని తేలింది. బోనస్‌ ఇష్యూ అంటేనే ప్రస్తుత వాటాదారు లకు అదనపు వాటాలు కల్పించడమేనని ఇన్వెస్టర్లు దీనివల్ల పన్ను ప్రోత్సాహకంకూడా పొందగలుగుతారని నిపుణుల అంచనా. ఎక్కువ డివిడెండ్‌ కేటాయించడం వల్ల ప్రభు త్వానికి డిడిటి కూడా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందని ఐడిబిఐ కేపిటల్‌ రీసెర్చి హెడ్‌ ఎకెప్రభాకర్‌ వెల్లడించారు.

కేంద్ర బడ్జెట్‌ 2016-17లోప్రభుత్వం పదిశాతం డివిడెండ్‌ చెల్లింపులపై పన్ను ప్రకటించింది. పదిలక్షలు దాటిన వారికి ఈపన్ను వర్తిస్తుంది. హిందూ అవిభక్త కుటుంబం లేదా భాగస్వామ్య సంస్థ లు ఏవైనా సరే ప్రైవేటు ట్రస్టులకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటించిం ది. 2011లో 48 సంస్థలు బోనస్‌షేర్లు జారీచేస్తే 2012లో 55సంస్థలు, 2013లో 59సంస్థలు, 2014లో 490, 2015లో 59, 20167లో 69 సంస్థలు బోనస్‌షేర్లు జారచేసాయి. 2017లో ఇప్పటి వరకూ 27 కంపెనీలు బోనస్‌షేర్లజారీని చేపట్టాయి.