బోటు ప్ర‌మాదం ఆరుగురు మృతి

Boat Accident
Boat Accident

క‌ర్వార్: క‌ర్నాట‌క‌లోని క‌ర్వార్ వ‌ద్ద బోటు మునిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఆరు మంది మృతిచెందారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బోటులో 22 మంది ఉన్నారు. జాల‌ర్లు, కోస్టుగార్డ్‌లు గ‌ల్లంతు అయిన వారి కోసం వెతుకుతున్నారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆరుగురి ఆచూకీ చిక్కింది. మిగితా వారి కోసం అన్వేష‌ణ కొన‌సాగుతోంది. రెస్క్యూ ఆప‌రేష‌న్ ఇంకా జ‌రుగుతున్న‌ది.