బోటులో ప్రయాణించేటప్పుడు లైఫ్‌ జాకెట్‌ తప్పనిసరి: అఖిలప్రియ

AP Minister Akhila Priya
AP Minister Akhila Priya

విజయవాడ: బోటులో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులందరూ తప్పనిసరిగా లైఫ్‌ జాకెట్లు వేసుకోవాలని, ఒకవేళ ఎవరైనా లైఫ్‌ జాకెట్‌ వేసుకోకపోతే వారిని బోటులోకి అనుమతించరాదని పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ అన్నారు. మంగళవారం పలు ప్రైవేట్‌ బోటు అపరేటర్లు, అధికారులతో సమావేశం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ విజయవాడ మినహా మిగతా ప్రాంతాల్లో ప్రైవేట్‌ బోట్లను జలవనరుల శాఖ అనుమతితో నడుపుతున్నారని అయితే వీరందరూ టూరిజం శాఖతోనూ ఒప్పందం చేసుకోవాలని మంత్రి తెలిపారు. టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ తరుపున 75బోట్లు మాత్రమే నడుపుతున్నామని, త్వరలో వాటర్‌ టూరిజం పాలసీ తీసుకొస్తామని, సింగిల్‌ విండో విధానం ద్వారా లైసెన్సులు ఇస్తామని అఖిలప్రియ ప్రకటించారు.