బొల్లారంలో కోవింద్‌ విడిదికై సిఎస్‌ సమీక్ష

bolarum
bolarum

హైదరాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శీతాకాల విడిది కోసం ఈ నెల 21న హైదరాబాద్‌కు రానున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో నాలుగు రోజుల పాటు కోవింద్‌ బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి శీతాకాల విడిది ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌ కే జోషి…మిలిటరీ, పోలీసు, ఇతర ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి విడిది ఏర్పాట్లను సమన్వయం చేసుకోవాలని వివిధ శాఖల అధికారులను సిఎస్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21 సాయంత్రం 5 గంటలకు హకీంపేటకు రాష్ట్రపతి చేరుకోనున్నారు. 22న కరీంనగర్‌లో జరిగే ఓ కార్యక్రమంలో కోవింద్‌ పాల్గొననున్నారు. 23న బొల్లారంలో ఎట్‌ హోం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 24న తిరిగి ఢిల్లీకి బయల్దేరనున్నారు రాష్ట్రపతి కోవింద్‌.