బొద్దింకల నివారణకు

Cockroaches
Cockroaches

బొద్దింకల నివారణకు

బొద్దింకలు ఎక్కువగా ఆహార పదార్థాలు, చిమ్మ చీకటిగా ఉండే ప్రదేశాలు, బీటలు, సందుల్లో, పుస్తకాల్లో, మురుగుగొట్టాల్లో ఉంటా యి. వీటివల్ల టైఫాయిడ్‌, కలరా వ్యాపించే ప్రమాదం ఉంది. నివారణకు…

ఫర్నిచర్‌, గృహోపకరణాలకింద చెత్త పేరుకోకుండా శుభ్రం చేయాలి.
బాత్‌రూముల్లోని అవ్ఞట్‌లెట్స్‌పై వైర్‌ నెట్టింగ్‌ నాఫ్తలిన్‌ బాల్స్‌ వేయించాలి.

గట్టి మూతలనున్న చెత్తబుట్టలను వాడాలి. వంటింటి అరలను, నేలను శుభ్రంగా ఉంచాలి.

వంటింటి సింక్‌లో పాత్రలను సాధ్యమైనంతవరకూ నిల్వ ఉంచకూడదు.
ప్రతిరోజు కార్పెట్లు, ఫర్నిచర్‌ను శుభ్రపర్చాలి.
సిలికాప్లెయిన్‌ జెల్‌ను ఉపయోగించడం వలన శరీరంలోని తడి ఆరిపోయి, పురుగులు వెంటనే మరణిస్తాయి.
గ్లూని పేపర్‌పై చల్లి, నిద్రపోయే ముందు దాన్ని వంటింటి మధ్యలో ఉంచితే బొద్దింకలు చస్తాయి.
అరకప్పు పిండి, పావ్ఞకప్పు పంచదార, 20శాతం బోరిక్‌ పౌడర్‌ కలిపి, ఉండలుగా చేసి, బొద్దింకలు తిరిగే ప్రదేశాలలో ఉంచినట్లయితే వాటి బాధ తగ్గుతుంది. బీ బేగాన్‌ స్ప్రే, క్రిస్టల్స్‌, హిట్‌, ఫినిట్‌, పెస్ట్‌సీల్‌, హంటర్‌లను ఇళ్లల్లో ఉపయోగించవచ్చు. నాలుగు గంటల తరువాత స్ప్రే ఆవిరి అయిన తరువాత అలమారలో పాలిథిన్‌ పేపర్లు వేసి సామాను సర్దుకుంటే మంచిది.

=====