బొడ్డుపల్లి హత్యోదంతంలో నిందితుల లొంగుబాటు

నల్గొండ: నల్గొండ మున్సిపల్ ఛైర్పర్సన్ భర్త హత్యకేసులో మరో ముందడుగు పడింది. బొడ్డుపల్లి శ్రీనివాస్ హత్య కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న రాంబాబు, మల్లేశ్, శరత్ నల్గొండ ఎస్పీ ముందు లొంగిపోయారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. నల్గొండ మున్సిపల్ ఛైరపర్సన్ లక్ష్మి భర్త శ్రీనివాస్ బుధవారం రాత్రి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకే శ్రీనివాస్‌ను హతమార్చారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఆ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, వీహెచ్, షబ్బీర్ అలీ తదితరులు ఛైర్పర్సన్ లక్ష్మి కుటుంబాన్ని ఇవాళ పరామర్శించారు.