బొజ్జ నిండుగ!

GIRL EATING
GIRL EATING

బొజ్జ నిండుగ!

స్కూల్స్‌ మొదలవుతున్నాయి. పిల్లలకు బాక్స్‌లలో ఏమి పెట్టాలా అని తల్లులు సతమతమవుతుంటారు. అలా అవస్థలు పడకుండా మీ పిల్లలకు నచ్చేలా లంచ్‌బాక్స్‌ను ఇలా తయారుచేసి పంపండి.

లంచ్‌బాక్స్‌లో పెట్టిన చపాతీలు మెత్తగా ఉండాలంటే వాటిని గ్లాస్‌క్లాత్‌లో చుట్టి బాక్స్‌లో పెట్టడం వల్ల మెత్తగా ఉంటాయి. ్జ పిల్లలకు పెరుగన్నం పంపేటప్పుడు అన్నం చల్లార్చి పెరుగు కలిపి పంపాలి. వేడిఅన్నంలో పెరుగు వేసి పంపడం వల్ల పెరుగు విరిగి నీరంతా బయటకు వచ్చి పాడైపోతుంది.

లంచ్‌బాక్స్‌ ఎప్పుడూ శుభ్రంగా, డ్రైగా ఉండాలి. పోషకాహారం తీసుకునే పెద్దవాళ్లే పిల్లలకు ఉదాహరణ కావాలి. దాదాపు పిల్లల ఆహారపు అలవాట్లు తల్లిదండ్రుల ఆహార అలవాట్ల మీదే ఆధారపడి ఉంటుంది.

పిల్లలకు ఇచ్చే ఆహారపదార్థాల్లో నూనె మోతాదు తక్కువగా ఉండాలి.

పిల్లల లంచ్‌బాక్స్‌లో తప్పనిసరిగా సీజనల్‌ పండ్లు ఉండాలి.

పిల్లలకు మజ్జిగ లస్సీ, పండ్లరసాలు పంపేటప్పుడు అవి ఇతర ఆహారపదార్థాలతో కలవకుండా, ఒలికిపోకుండా జాగ్రత్త పడాలి. ఇలా వారి లంచ్‌బాక్స్‌ పెట్టడం వల్ల వారికి అందాల్సి పోషకపదార్థాలన్నీ అందుతాయి.

పిల్లలకు స్కూల్‌కి పెట్టే లంచ్‌బాక్స్‌లో ప్రొటీన్స్‌ తప్పనిసరిగా ఉండేలా చూడాలి. ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల వారు త్వరగా అలసిపోకుండా ఉంటారు.

పనీర్‌ పరాటాతో పప్పు, సీజనల్‌ పండు ఒకటి ఇవ్వడం వల్ల వారికి అందాల్సిన ప్రొటీన్స్‌ దాదాపు అందినట్లే.

వెజిటబుల్‌ పలావ్‌, ఉడికించిన గుడ్డు, కమలాపండు, టమాట రైతా ఇవ్వడం వల్ల ఫైబర్‌తో పాటు అన్ని కంటెంట్స్‌ పిల్లలకు అందుతాయి. వెజిటబుల్‌ పోలితో పాటు పల్లీ చట్నీ. పాలకూర, ఆకుకూరల పరాటా, నిమ్మకాయ, అల్లంపచ్చడి. ్జ గట్టిపప్పు, మజ్జిగ వంటి వాటిని కూడా లంచ్‌బాక్స్‌లో చేర్చొచ్చు.

దాల్‌పరాటా, ఆకుకూరలు, వెజిటబుల్స్‌ కలిపి వండిన కూర పనీర్‌ సాండ్‌విచ్‌, జామకాయ. ్జ సాంబార్‌ అన్నం, తోటకూర వేపుడు, మజ్జిగ ఇలాంటి కాంబినేషన్స్‌లో ఐటమ్స్‌ పెట్టడం వల్ల వారికి లంచ్‌బాక్స్‌ ఆకర్ష ణీయంగా ఉండి తినే విధంగాఉంటుంది.