బొగ్గు ధరలను పెంచిన కోల్‌ఇండియా

COAL
COAL

కోల్‌కతా, జనవరి 9: ప్రపంచంలోనే అతిపెద్ద బొగ్గు గనుల సంస్థ, ప్రభుత్వ రంగ కోల్‌ఇండియా వంటేతర బొగ్గు ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ధరల పెంపునకు బోర్డు ఆమోదం తెలిపినట్లు సంస్థ మంగళవారం ప్రకటించింది. ఈ పెంపు తక్షణమే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. సగటు ధరపై 10శాతం పెంచినట్లు కోల్‌ఇండియా వర్గాల సమాచారం. ఈ ధరల పెంపు వల్ల 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీకి రూ.1,956కోట్ల అదనపు ఆదాయం సమకూరనున్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌ సందర్భంగా కోల్‌ఇండియా తెలిపింది. అంతేకాకుండా, కంపెనీ మొత్తం ఆదాయం కూడా రూ.6,421కోట్లకు చేరనున్నట్లు పేర్కొంది. గత కొన్ని నెలలుగా నిర్వహణ ఖర్చులు, సిబ్బంది జీతభత్యాలు, పనునలు పెరగడంతో ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చెబుతోంది. కాగా, ధరల పెంపు నేపథ్యంలో ఎక్ఛేంజీల్లో కోల్‌ఇండియా షేర్లు రాణిస్తున్నాయి. బిఎస్‌ఇ, ఎన్‌ఎస్‌ఇలో షేరు విలువ 5శాతం చొప్పున పెరిగి ధర రూ.303గా ట్రేడ్‌ అవుతోంది.