బైసన్‌పోలో మైదానం ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం?: కేసీఆర్‌

kcr meet with arunjaitly
kcr meet with arunjaitly

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి ఆరుణ్‌జైట్లీతో
సమావేశమయ్యారు. అనంతరం కేసీఆర్‌ మీడియాతో మట్లాడుతూ సచివాలయం నిర్మాణానికి బైసన్‌పోలో
మైదానం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, అలాగే మేడ్చల్‌, కరీంనగర్‌ రోడ్లు విస్తరణకు
భూములు ఇచ్చేందుకు ఆంగీకారం కుదిరిందని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలపై జీఎస్టీ
తగ్గించాలని కేసీఆర్‌ కోరగా.. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ పనులపై జీఎస్టీ తగ్గించే ఆంశాన్ని
పరీశీలించనున్నట్లు జైట్లీ తెలిపారు.ఈ నెల 9న హైదరాబాద్‌లో జరిగే జీఎస్టీ మండలి భేటీలో నిర్ణయం
తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం జైట్లీ మాట్లాడుతూ తెలంగాణ విజ్ఞప్తి మేరకే నిర్మాణాలపై
జీఎస్టీని 18శాతం నుంచి 12శాతానికి తగ్గించామని, 12శాతం నుంచి 5శాతానికి తగ్గించే విషయంలో
కూడా నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు.