బైక్‌ను ఢీకొన్న సురేష్‌బాబు కారు

suresh babu
suresh babu

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నిర్మాత సురేష్‌బాబు కారు కార్ఖానా పోలీసు స్టేషన్‌పరిధిలో బీభత్సం సృష్టించింది. సురేష్‌బాబు ప్రయాణిస్తున్న కారు ఇంపీరియల్‌ గార్డెన్‌ వద్ద రాంగ్‌ రూట్లో వచ్చి హోండా యాక్టివాను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న దంపతులు, మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ఖానా పోలీసులు కేసు నమోదు చేసి సురేష్‌బాబుకు నోటీసులు ఇచ్చారు. గాయపడ్డ వారిని యశోధ ఆస్పత్రికి తరలించారు. పారడైజ్‌ నుంచి బోయినపల్లి వెళ్లే క్రమంలో సురేష్‌బాబు కారు బైక్‌ను ఢీకొంది.