బే ఏరియాలో ద‌స‌రా-దీపావ‌ళి వేడుక‌లు

dasara ,diwali celebrations
dasara ,diwali celebrations

అమెరికాః దసరా, దీపావళి వేడుకలను పురస్కరించుకుని బే ఏరియాలో అక్టోబర్‌ 7న దసరా-దీపావళి ఢమాకాను నిర్వహిస్తున్నారు. శాన్‌హోసెలోని శాంతాక్లారా కౌంటీ ఫెయిర్‌ గ్రౌండ్స్‌లో ఈ కార్యక్రమం జరగనున్నది. అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండో అమెరికన్స్‌ (ఎఐఎ), బాలీ 92.3 ఎఫ్‌ఎం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. రావణ దహనం, బాణాసంచా వెలుగులు, నాన్‌స్టాఫ్‌ కల్చరల్‌ ప్రోగ్రామ్స్‌, డిజె డ్యాన్స్‌తోపాటు పిల్లల కోసం జెయింట్‌ వీల్‌, ఫ్యాషన్‌ షో, ఫ్యాన్సీ డ్రస్‌ కాంపిటీషన్స్‌, ఎంటర్‌టైనింగ్‌ గేమ్స్‌, మిఠాయి ఫెస్టివల్‌, దియా తయారీ, హాయ్‌ చెప్పే దేశీ మస్కాట్స్‌లు, భాంగ్రా ఫెస్టివల్‌, ట్రైన్‌ జర్నీ ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ ఢమాకాలో మీకు కనిపిస్తాయి. ఇందులో వ్యాపారవాణిజ్య వర్గాలు బూత్‌లను ఏర్పాటు చేయవచ్చని దానికోసం 510 894 వీజుకూూ లో సంప్రదించవచ్చని నిర్వాహకులు తెలిపారు.