బేతాళుడు

T4
A Still From Betaludu

బేతాళుడు వచ్చేస్తున్నాడు!

విజ§్‌ు ఆంటోని కధానాయకునిగా తమిళంలో రూపొందుతున్న సైతాన్‌ చిత్రం తెలుగు ప్రేక్షకులను ‘బేతాళుడు గా త్వరలో పలకరించబోతోంది. ఈ సందర్భంగా.. నిర్మాత ఎస్‌.వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 6 న బేతాళుడు ఆడియో చలన చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరగనుంది. తెలుగు,తమిళంలో చిత్రం నవంబర్‌ 18న విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిపారు. చిత్ర కథానాయకుడు విజ§్‌ు ఆంటోని మాట్లాడుతూ.. నటునిగా వైవిధ్యమైన పాత్రల పోషణ లక్ష్యంగా ఉన్న నాకు కొనసాగింపు ఈ సైతాన్‌ సైకలాజికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ చిత్రం తెలుగునాట ‘బేతాళుడు పేరుతో విడుదల అవుతోంది.సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ గా ఈ చిత్రంలో నా పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నమైనదిగా ఉండటంతో పాటు, వైవిధ్యాన్ని సంతరించుకుని ఉంటుంది. నా సరసన అరుంధతి నాయర్‌ నాయికగా నటిస్తున్నారు. చిత్ర దర్శకుడు ప్రదీప్‌ కుమార్‌ ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో అలరించేలా తీర్చిదిద్దుతున్నారని నమ్ముతున్నాను. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ ఓ ఎస్సెట్‌. ఈ సినిమాకు సంగీతం నేనే అందించాను. పాటలు,నేపధ్య సంగీతం ప్రేక్షకులను అలరిస్తాయని ఆశిస్తున్నాను. బిచ్చగాడు విజయం తరువాత విడుదల అవుతున్న సైతాన్‌ చిత్రం పై సహజంగా అంచనాలు అధికంగానే ఉంటాయి. వాటికి తగిన స్థాయిలోనే ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.