బెల్లీ డ్యాన్సర్‌గా కుమారి

Hebah Patel
అలా ఎలా.. అని అడుగుతూ టాలీవుడ్‌ అరంగేట్రం చేసిన హెభాపటేల్‌.. కుమారి21 ఎఫ్‌లో చేసిన బోల్డ్‌ రోల్‌తో సూపర్‌హిట్‌ కొట్ట్టేసింది..ఆ తర్వాత అడో రకం.. ఈడోరకం.. అంటూ మరో హిట్‌ సాధించి.. వరుసగా రెండు సక్సెస్‌లు అందుకుంది.. ఇపుడుజోరు మీదున్న నిఖిల్‌తో కూడ హిట్‌ పట్టేసి.. హ్యాట్రిక్‌ కొట్టేయాలని చూస్తోంది హేబా..

విఐ ఆనంద్‌ డైరెక్షన్‌లో నిఖల్‌ చేస్తున్న మూవీ ‘ఎక్కడికి పోతావు చిన్నదానా.. థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతుండగా ఈ మూవీలో హీరోయిన్‌ హెభా పటేల్‌.. ఓబెల్లీ డ్యాన్సర్‌ రోల్‌ చేన్తోంది.. ..ఈమూవీలో తనకు ఈ డ్యాన్సర్‌ రోల్‌ ఆఫర్‌ రాగానే.. చాలా ఎగ్జయిట్‌ అయిందట హేభ… ఈరోల్‌ని ఫర్పెక్ట్‌గా పోషించేందుకు గానూ, స్పెషల్‌గా ట్రైనింగ్‌ కూడ తీసుకుందని సన్నిహితులు చెబుతున్నారు.. ఆ డ్యాన్సర్ల బాడీ లాంగ్వేజ్‌ ను కూడ బాగానే పట్టేసిందట.. కంటిన్యూగా డ్యాన్స్‌ ప్రాక్టీసులు చేయటంతో ఇపుడీ కుమారి మరింత ఫిట్‌గా మారిపోయి ందని అంటున్నారు. లుక్‌ విషయంలో కూడ హేభ బాగా ఇంప్రూవ్‌ అయిందనే కామెంట్స్‌ వస్తున్నాయి.. మొత్తానికి నిఖిల్‌ మూవీలో కొత్త కుమారిని చూడ్డం ఖాయమనే టాక్‌ ఉంది. అటు డ్యాన్స్‌.. ఇటు ఫెర్ఫామెన్స్‌ రెండింటిలోనూ హేభా పటేల్‌ ఇరగదీసేస్తోందని టాక్‌.