బెల్లం దివ్యౌషధం

Jaggery
Jaggery


చెరకురసం శరీరానికి చలువ చేస్తుంది. కాచిన చెరకు రసం శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంద.ఇ కడుపులోని వాయువుని, కడుపునొప్పిని పోగొడుతుంది. కొత్తబెల్లం జఠరాగ్నిని పెంచుతుంది. పాత బెల్లం తేలికగా జీర్ణమై శరీరాన్ని తేలికపరుస్తుంది. వేడికి తగ్గించి కొవ్వును కరిగిస్తుంది. రక్తదోషాన్ని పోగొడుతుంది. వాతరోగాల్ని తగ్గిస్తుంది. బెల్లాన్ని శొంఠితో కలిపి సేవిస్తే, అన్ని రకాల వాతరోగాలు తగ్గుతాయి. అల్లంతో కలిపి సేవిస్తే కఫవ్యాధులు పోతాయి. కరక్కాయ చూర్ణంతో కలిపి సేవిస్తే మూలవ్యాధిని తగ్గిస్తుంది. తాటి బెల్లం, ఖర్జూర బెల్లం, కొబ్బరి బెల్లాలు కూడా తయారీలో ఉన్నప్పటికీ ప్రస్తుతం చెరకు బెల్లాన్నే ఎక్కువగా వాడుతున్నారు. దీనిలోని పోషక విలువలు విశిష్టం. ఆర్గానిక్‌ బెల్లం మరింత శ్రేష్టం. చెరకును పండించినపుడు కృత్రిమ రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడరు. బెల్లంలో తెలుపు లేదా ఎరుపు రంగు రావడానికి కెమికల్స్‌ వాడరు. దీంట్లో సుక్రోజ్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉంటాయి. పొటాషియం, జింక్‌, సెలీనియం వంటి ఖనిజాలు వార్ధక్యాన్ని దూరం చేయటానికి ఉపకరిస్తాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/