బెజ‌వాడ‌లో బ్యాంక్ సిబ్బంది ఘ‌రానా మోసం

UBI
UBI

విజయవాడ : సిటీలో ఘరానామోసం వెలుగు చూసింది. ఇద్దరు ఉద్యోగులు తాము పనిచేసే బ్యాంకుకే టోకరా పెట్టారు. రూ.25లక్షలు స్వాహా చేశారు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడ యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగులు విద్యాధరరావు, నాగేశ్వర రావు ఘరానా మోసానికి పాల్పడ్డారు. అశోక్‌ చక్రవర్తి పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి రూ. 25లక్షలకు శఠగోపం పెట్టారు. అయితే కొంత కాలానికి తీసుకున్న రుణం కట్టాలంటూ అసలు వ్యక్తికి నోటీసులు వెళ్లాయి. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తాను ఎప్పుడు లోన్‌ తీసుకోలేదంటూ అశోక్‌ చక్రవర్తి వాపోయారు.