బెండ దప్పళం

hqdefault
hqdefault

బెండ దప్పళం

కావలసినవి :
బెండకాయలు-పావుకేజీ, ఉల్లిగడ్డ-1 ఆవాలు, జీలకర్ర-ఒక టేబుల్‌స్పూన్‌ చొప్పున ఎండుమిర్చి-6, పచ్చిమిర్చి-4, టమాట-1 జీలకర్ర, మెంతిపొడి-ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం, వెల్లుల్లి ముద్ద-అర టేబుల్‌ స్పూన్‌ కారం-అర టేబుల్‌స్పూన్‌, చింతపండు రసం-కప్పు శనగపిండి-రెండు టేబుల్‌స్పూన్లు, పసుపు-పావ్ఞ టేబుల్‌స్పూన్‌ కొత్తిమీర -చిన్నకట్ట కరివేపాకు-రెండు రెమ్మలు

తయారుచేసే విధానం

బెండకాయలను శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. స్టౌమీద మందపాటి గిన్నెలో నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేగాక బెండకాయముక్కలు, ఉల్లితరుగు, పచ్చి మిర్చి, టమాట వేసి కలపాలి. మగ్గాక జీలకర్ర, మెంతిపొడి, పసుపు, అల్లం,వెల్లుల్లి ముద్ద కారం, చింతపండు పులుసు తగినంత నీరు పోసి మరగ నివ్వాలి. చిన్నగ్లాసుడు చన్నీటిలో శనగపిండిని ఉండలు లేకుండా కలిపి మరుగుతున్న పులుసులో పోసి కలపాలి. చివరగా కొత్తిమీర, కరివేపాకు వేసి దింపేయాలి.