బెంగళూరుపై కోల్కతా విజయం

ఐపీఎల్ -2018లో భాగంగా ఇవాళ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. అయితే, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు గాను నాలుగు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. అనంతరం 176 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన కోల్ కతా 19.1 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఆరు వికెట్ల తేడాతో బెంగళూరుపై కోల్కతా విజయం సాధించింది.