బెంగుళూరులోని ఫ్రాన్స్‌ కాన్సులేట్‌కి బెందిరింపు లేఖ

హైదరాబాద్‌ : భారత గణతంత్ర దినోవ్సవ వేకుడలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇప్పటికే రిపబ్లిక్‌డే వేడుకులకు భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దేశంలోకి చొరబడ్డారన్న నిఘా వర్గాల హెచ్చరికలతో దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ ముఖ్య అతిథిగా హాజరుకానున్న నేపథ్యంలో బెంగుళూరులోకి ఫ్రాన్స్‌ కాన్సులేట్‌ కార్యాలయానికి ఒక బెదిరింపు లేఖ వచ్చిన విషం గురువారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 14వ తేదీనే వచ్చిన సదరు లేఖపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను కూడా ప్రారంభించారు. విచారణలో భాగంగా తమిళనాడు రాజధాని చెన్నై నుండి ఈ లేఖను గుర్తుతెలియని వ్యక్తులు పోస్టులో వేసినట్లు పోలీసులు గుర్తించారు.