బెంగుళూరును బాదేసిన చెన్నై

CSK
CSK

పుణెః ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌లో భాగంగా పుణెలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియం వేదిక‌గా ఈ రోజు బెంగ‌ళూరు, చెన్నై జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో బెంగ‌ళూరుపై చెన్నై గెలుపొందింది. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌కు తొమ్మిది వికెట్లు కోల్పోయి 127 ప‌రుగులు చేసింది. అనంత‌రం 128 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చెన్నై 20 ఓవ‌ర్లలో రెండు ఓవ‌ర్లు మిగిలి ఉండ‌గానే.. 18 ఓవ‌ర్ల‌కు నాలుగు వికెట్లు కోల్పోయి 128 ప‌రుగులు చేసింది. దీంతో ఆరు వికెట్ల తేడాతో బెంగ‌ళూరుపై చెన్నై విజ‌యం సాధించింది.

బెంగ‌ళూరు బ్యాటింగ్‌: పార్ధీవ్ ప‌టేల్ 54, సౌథీ 36, కోహ్లీ 8, చెన్నౌ బౌలింగ్ : జ‌డేజా 3, హ‌ర్భ‌జ‌న్ 2 వికెట్లు తీశారు. చెన్నై బ్యాటింగ్ : వాట్స‌న్ 11, రాయుడు 32, సురేష్ రైనా 25, షోరేయ్ 8, ధోని 31, బ్రావో 14 ప‌రుగుల‌తో రాణించారు.