బెంగాల్‌ రాష్ట్ర ప్రభుత్వ రాజకీయం నేరమయం

ప్రధానమంత్రి మోడీ

PM MODI
PM MODI

New Delhi: : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ త్వరలో ఎన్నికలు జరుగనున్న అసోం, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శంకు స్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడం ద్వారా తన మొదటి పొలిటికల్‌ క్యాంపెయిన్‌ని శనివారం ప్రారంభించారు.

ముందుగా అసోం వెళ్లి అక్కడ రెండు మెడికల్‌ కాలేజీలకు శంకుస్థాపన చేయడమే కాక ప్రతిష్టాత్మకమైన ‘అసోం మాలా ప్రాజెక్టుని సోనిత్‌ పూర్‌ జిల్లా థెకియాజులిలో ప్రారంభించారు. అసోం రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి రహదారుల అభివృద్ధికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దఎత్తున కృషి చేసింది. రాష్ట్రంలో ఉన్న తమ బిజెపి ప్రభుత్వం మళ్లీ ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన నేపథ్యాన్ని కేంద్ర ప్రభుత్వం బలంగా ఏర్పరచడానికి ఇటీవలే అసోంలోని స్థానిక ఆదివాసీ జాతులవారికి భూమిపై హక్కునుకల్పిస్తూ పత్రాలు అందించింది. ఆదివారంకూడా రాష్ట్రంలోఉన్న తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తు తించిన ప్రధాన మంత్రి మోడీ… సాయంత్రానికి బెంగాల్‌ వెళ్లి తన చురుకైన మాటలతో టిఎంసి ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు.

భారత్‌ పెట్రో లియం కార్పొరేషన్‌ నిర్మించిన ఎల్‌పిజి టెర్మినల్‌ని దేశానికి అంకితం చేయడంతో సహా ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోడీ బెంగాల్లో పాల్గొ న్నారు. అలాగే పొలిటికల్‌ ర్యాలీని కూడా నిర్వ హించారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని కమ్యూ నిస్టు పార్టీ సెకండ్‌ వెర్షన్‌ పాలనగా అభివర్ణించారు. మమత పాలనలో ”కమ్యూనిజం తిరిగి జన్మిం చిందని, రాజకీయాలు నేరమయం కావడం, అధి కార యంత్రాంగం రాజకీయమయం కావడం ఇందుకు నిదర్శనం అని ప్రధాని పేర్కొన్నారు.

”రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉండటానికి రాష్ట్ర రాజకీ యాలే కారణం అని ఆయన అన్నారు. హల్ది యాలో జరిగిన ఒక రాజకీయ ర్యాలీలో ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ ”నందిగాం ప్రజలపై కాల్పులు జరిపినవారినే ఆమె తన పార్టీలోకి ఎందుకు తీసుకుంటుందని బెంగాల్‌ ప్రజలు అడగాలి అని ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి అన్నారు.