బెంగాల్‌ ప్రభుత్వం చమురుపై రూపాయి తగ్గింపు

MAMATA
MAMATA

కోల్‌కత్తా: పెట్రోల్‌ ధరల పెంపుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత పెరుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ స్పష్టత రాకపోయేసరికి రాష్ట్ర ప్రభుత్వాలే చొరవచూపుతూ తమంతట తాముగా చమురు ధరల భారాన్ని తగ్గించుకునేందుకు ముందుకు వస్తున్నాయి. తాజాగా తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి పశ్చిమ బెంగాల్‌ సియం మమతా బెనర్జీ పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు ధరలను లీటరుకు రూ. 1 చొప్పున తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు మమతా ప్రకటించారు. కాని రాజస్థాన్‌ ప్రభుత్వం మాత్రం లీటర్‌కు రూ. 2.5 చొప్పున తగ్గించినట్లు ప్రకటించింది.