బెంగాల్‌ ప్రజల పరువు తీస్తున్న మమత

modi
modi

జల్‌పా§్‌ుగురిలో ప్రధానిమోడీ
న్యూఢిల్లీ: టిఎంసి అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రభుత్వం పశ్చిమబెంగాల్‌రాష్ట్ర ప్రజలను అప్రతిష్టపాలుచేసిందని, ఇపుడు ఆరాష్ట్రంలో వామపక్ష ప్రజలు సైతం నిస్సహాయస్థితిలో ఉన్నారని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. బెంగాల్‌లో ఒక దోపిడీ మాఫియా సిండికేట్‌ కొనసాగుతున్నదని ఆమాఫియాయే రాష్ట్రంలో పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. ఉత్తరబెంగాల్‌లోని జల్‌పా§్‌ుగురి జిల్లాలో జరిగిన బిజెపి ర్యాలీలో మోడీ పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో దోపిడీ సిండికేట్‌ కొనసాగుతోందని, దీదీ ప్రభుత్వం కాదని దుయ్యబట్టారు. మా మాతి మనుష్‌ నినాదంతో బెంగాల్‌లోఅధికారంలోనికి వచ్చిన పార్టీ హింసను రెచ్చగొడుతున్నదని అన్నారు. వామపక్షాలను కూలదోసి ప్రభుత్వంచేపట్టిన పార్టీ ఇపుడు రాష్ట్రం మొత్తం హింసను ప్రేరేపిస్తోందని పేర్కొన్నారు. అక్కడున్న వామపక్ష కేడర్‌ మొత్తం నిస్పహాయ స్థితిలోనికి చేరిపోయిందని పేర్కొన్నారు. కోల్‌కత్తాపోలీస్‌ కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌ను సిబిఐ అధికారులు అరెస్టుచేసేందుకు వచ్చినసందర్బంగా జరిగిన ధర్నాను ఉటంకిస్తూ ప్రధాని ఒక ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా దేశచరిత్రలో మోసగాళ్లకు మద్దతుగా దర్నా నిర్వహించడం ఇక్కడే చూసామని అన్నారు. ఈమోసగాళ్ల ముఠాయే లక్షలాదిమంది నిరుపేదలసొమ్మును లూటీచేసిందన్నారు. ఈ చౌకీదారు కుట్రలను, చిట్‌ఫండ్‌ కుంభకోణాలను, వారిని రక్షించేవారిని ఎంతమాత్రం సహించేదిలేదని పేర్కొన్నారు. భారీ ఎత్తున హాజరైన కార్యకర్తలు, ప్రజలనుద్దేశించి యైనాగురిలో మోడీ మరొకరాలీలో మాట్లాడుతూ మీరు తేయాకును పండిస్తునఆనరని, తేనీటిని తయారుచేస్తున్నారని, అయితే మమతా బెనర్జీకి చా§్‌ువాలాలంటే ఇష్టం లేదని ఆశ్చర్యం వ్యక్తంచేసారు. ముఖ్యమంత్రి మమతానుద్దేశించి ప్రధాని పలు విమర్శలు గుప్పించారు. దమ్ముంటే సీఎం జల్‌పా§్‌ుగురికి వచ్చి బిజెపికి ప్రజల మద్దతును చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో టిఎంసి అంటే కమ్యూనిస్ట్‌ పార్ట్‌ టు భాగమని ఆయన విమర్శించారు. కొత్త హైకోర్టు సర్క్యూట్‌బెంచ్‌ను జల్‌పా§్‌ుగురిలోప్రారంభించి అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్‌, తృణమూల్‌కాంగ్రెస్‌ లేదా వామపక్షాలు రాష్ట్రంలో ప్రజల సంక్షేమం పట్ల శ్రద్ధలేదని, బెంగాల్‌లోప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలన్నీ కేంద్ర ప్రభుత్వం సమకూర్చినవేనని పేర్కొన్నారు. కలకత్తాహైకోర్టు జల్‌పాయిగురి సర్క్యూట్‌ బెంచ్‌ స్థానిక జనాభాకు సహకరిస్తుందని అన్నారు. 20 ఏళ్లక్రితం ఈప్రాజెక్టుకు ప్రతిపాదన జరిగిందని, ఇపుడు ఏళ్లతరబడి కొనసాగి ఎన్‌డిఎ హయాంలో కలనెరవేర్చిందని పేర్కొన్నారు. జల్‌పాయిగురి ప్రజలకు ఇపుడు జల్‌పాయిగురిలోనే న్యాయం అందుతుందన్నారు. కలకత్తా హైకోర్టుకు వెళ్లనవసరంలేదని, ఎలాంటి న్యాయసాయం అవసరం లేదని అన్నారు. ప్రధాని శుక్రవారం నాలుగేల్ల ఫలకాట సల్సలాబరి సెక్షన్‌ ఎన్‌హెచ్‌31 డి కి శంకుస్థాపనచేసారు. 41.7 కిలోమీటర్ల పొడవు గల హైవే సెక్షన్‌ను సుమారు 1938 కోట్లతో 2.5 ఏళ్లలోపే నిర్మాణం జరుగుతుందని వెల్లడించారు. ఈ కొత్త హైవే పర్యాటకరంగానికి ఎంతో అనుకూలంగా ఉందని చెపుతూనే ప్రముఖ సంస్కర్త రాజబంశి పంచానన్‌వర్మ నేపాలి కవి భానుభక్త్‌లను ఉదహరించారు. రాష్ట్రంలోశాంతిభద్రలు సమస్యాత్మకంగా మారాయని ఏళ్లతరబడి గూండాయిజం కొనసాగుతోందని మోడీ పేర్కొన్నారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నీ స్తంభించిపోయాయయని, పశ్చిమబెంగాల్‌ప్రభుత్వానికి ఇవేమీ పట్టవని పేర్కొన్నారు.