బెంగాల్‌లో బిజెపి నేత హత్య

Murder
Murder

కోల్‌కతా: రాష్ట్రంలో 24పరగణాల జిల్లాలో బిజెపి నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. మృతుడిని బిజెపి మండల కమిటీ కార్యదర్శి శక్తిపాద సర్ధార్‌గా స్థానికులు భావిస్తున్నారు. సర్ధార్‌ పని ముగించుకుని ఇంటికి వెళుతున్న సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడిపై కత్తితో దాడి చేశారు. రక్తస్రావం అవుతున్న అతడిని రోడ్డుపై వదిలేసి పారిపోయారు. స్థానికులు అతడిని గుర్తించి స్థానిక డైమండ్‌ హార్బర్‌ ఆస్పత్రికి తరలించారు. సర్ధార్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో కోల్‌కతాలో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో తుది శ్వాస విడిచాడు.