బెంగళూరు మిర్చి చట్నీ

బెంగళూరు మిర్చి చట్నీ
కావలసినవి:
బెంగళూరు మిరపకాయలు-పావు కేజి, కొద్దిగా చింతపండు, ఉల్లిపాయలు-2, వెల్లుల్లిపాయ రేకలు-2 ఉప్పు-తగినంత, కొబ్బరి చిప్ప-1, నూనె-ఆరు స్పూన్లు పోపుకు: ఆవాలు, కరివేపాకు, కొత్తిమీర, అర స్పూన్ మినపప్పు
తయారుచేసే విధానం:
బెంగళూరు మిరపకాయలను, ఉల్లిపాయలను ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి చిప్పను తురిమి పెట్టుకోవాలి. చింతపండును నీటిలో నానపెట్టాలి. పెనంలో కొద్దిగా నూనెవేసి కొబ్బరి తురుమును వేయించి ఒక ప్లేటులో తీసి పెట్టుకోవాలి. తరువాత మిగతా నూనె వేసి మిరప, ఉల్లిపాయముక్కలు, వెల్లుల్లిపాయ రేకలను దోరగా వేయిం చాలి. ముందుగా వేయించిన కొబ్బరి తురుమును మిక్సీలో వేసి తగినంత ఉప్పు కలిపి గ్రైండ్ చేయాలి. మూడువంతుల భాగం గ్రైండ్ అయిన తరువాత వేయించిన మిరప, ఉల్లి, వెల్లుల్లిలను వేసి నానపెట్టిన చింతపండు పులుసును వేసి తగినట్లుగా గ్రైండ్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బెంగళూరు మిరపకాయల చట్నీ రెడీ. ఈ చట్నీకి పెనంలో మిగిలి ఉన్న ఆయిల్ వేసి ఆవాలు, మినపప్పు, కరివేపాకు, కొత్తిమీర వేసి తాలింపు పెట్టుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇడ్లీ, దోసెలకు చాలా రుచిగా ఉంటుంది.