బురఖాలపై పాక్షిక నిషేధానికి కామెరూన్ మద్దతు
లండన్: బ్రిటన్‌లో బురఖాలు ధరించటంపై పాక్షిక నిషేధాన్ని విధించారు. పాఠశాలలు, కోర్టులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బురఖాలపై నిషేధానికి బ్రిటిష్ ప్రధాని కామెరూన్ మద్దుతు తెలిపారు. అయితే ఫ్రాన్స్‌లో మాదిరిగా మొత్తంగా బురఖా పద్దతిని నిషేధించటానికి తాము వ్యతిరేకమని పేర్కొన్నారు. అయితే విద్యాసంస్థలు, కోర్టులు, సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద బురఖాలపై నిషేధం విధించటంతో తప్పులేదని అన్నారు. అటువంటి ప్రదేశాల్లో నిబంధనలు మతంతో సంబంధం లేకుండా అరదరికీ ఒకేలా ఉండాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.