బుమ్రాపై కోహ్లీ ప్రశంసల జల్లులు

బుమ్రాపై కోహ్లీ ప్రశంసల జల్లులు
burmah


కింగ్‌స్టన్‌ (జమైకా): ప్రస్తుతం జస్ప్రీత్‌ బుమ్రాపై అందరి చూపు. అతనో పరిపూర్ణ బౌలర్‌ని భారత్‌ క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కితాబిచ్చాడు. బుమ్రా అంతర్జాతీయ క్రికెట్‌లో ఉండడం గొప్ప విషయమని, తమ జట్టులో అతను ఉండడం తమ అదృష్టంగా కోహ్లీ పేర్కొన్నాడు. ‘ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్‌ కావాలని బుమ్రా కోరుకున్నాడు. క్రమశిక్షణ, పనితీరుతో తన ఆట తీరును మార్చుకున్న విధానం రానున్న క్రీడాకారులకు ఆదర్శమని కోహ్లీ ప్రశంసించారు. అంతేకాదు అతని బౌలింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. ఈ సందర్భంగా రవీంద్ర జడేజాపై కూడా కోహ్లీ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు.
తాజా జాతీయ వర్తాల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/