బుధవారానికి లోక్సభ వాయిదా

న్యూఢిల్లీ: మాజీప్రధాన మన్మోహన్సింగ్పైప్రధానిమోడీ చేసినవ్యాఖ్యలకువివరణ ఇవ్వాలని పట్టుబడుతూ నిరసనతెలుపుతున్నకాంగ్రెస్ శుక్రవారం కూడా లోక్సభలో తననిరసననుకొనసాగించింది. వరుసగా ఐదురోజులనుంచి సభా కార్యక్రమాలకు అడ్డుతగులుతూ వివరణ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అంతేకాకుండా బిజెపి కూడా ఈఆరోపణలపై క్షమాపణలు చెప్పాలని కోరింది. అలాగే 2జి స్పెక్ట్రమ్ కేసుకు సంబంధించి బిజెపి చేసిన ఆరోపణలపై క్షమాపణ ఇవ్వాలని కోరింది. సభ ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టింది. కాంగ్రెస్ సభ్యులు వెల్లోనికిదూసుకువచ్చి మోడీ క్షమాపణలు చెప్పాలంటూ పెద్దపెట్టున నినాదాలుచేసారు. గుజరాత్ఎన్నికల ప్రచారంలోమన్మోహన్సిగ్ ఇతరులు పాకిస్తాన్తో కుమ్మక్కయి ఎన్నికలఫలితాలను మార్చాలని కుట్రలుచేసారన్న ఆరోపణలపై కాంగ్రెస్మండిపడుతోంది. ప్రశ్నోత్తరాలను స్పీకర్ సుమిత్రా మహాజన్కొనసాగించినా కాంగ్రెస్ సభ్యులుతమ నిరసననుకొనసాగిస్తూనే ఉన్నారు. లోక్సభలో కాంగ్రెస్నేత మల్లిఖార్జున్ఖర్గేఐదురోజులుగా తాము డిమాండ్చేస్తున్నా ప్రశ్నోత్తరాలను కొనసాగించడంపైతీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. కొద్దినిమిషాల తర్వాత జీరో అవర్నుప్రారంభించారు.కాంగ్రెస్సభ్యులు నిరసన తెలుపుతూ వాకౌట్చేసారు. మోడీతో క్షమాపణ చెప్పించడంతోపాటు బిజెపినేతలనుంచి కూడా 2జి స్కాంపై చేసిన వ్యాఖ్యలపట్ల క్షమాపణలు చెప్పాలని డిమాండ్చేశారు. స్పెసల్ కోర్టు మొత్తం నిందితులందరూ నిర్దోషులేనని కొట్టివేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మరింత శక్తిని పుంజుకున్నట్లయింది. ఐదోరోజూకూడాఇదే నిరసన కొనసాగుతుండటంతోట్రెజరీబెంచ్లు,ప్రతిపక్షంలో కూడా హాజరు పలచగా కనిపించింది. ప్రధాన మంత్రి, యుపిఎ ఛైర్పర్సన్సోనియాగాంధీ,కాంగ్రెస్ అధ్యక్షుడురాహుల్గాంధీలు సభలోనే ఉన్నారు. సోనియా గాంధీ ప్రశ్నోత్తరాలసమయంలో హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా శెలవులు రావడంతో పార్లమెంటు వచ్చే బుధవారం నాటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.